రైతు సమస్యలపై చర్చించేందుకు కమిటీ వేయాలి
పెట్టుబడిదారుల కోసమే ప్రధాని పనిచేస్తున్నారు
రాహుల్ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందంం
కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని, రైతు సమస్యలపై చర్చించేందుకు జెఎసి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసిన రాహుల్ బృందం రామ్నాత్ కోవింద్‌కు వినతిపత్రం సమర్పించింది. అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించిన దాదాపు రెండుకోట్ల సంతకాలను అందచేశారు. అంతకు ముందు ర్యాలీగా బయలుదేరిన ప్రియాంక వాద్రా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం రాహుల్ వి•డియాతో మాట్లాడుతూ పెట్టుబడిదారుల కోసం మాత్రమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. రైతులైనా, కార్మికులైనా, మోహన్ భగవత్ అయినా ప్రధాని మోదీ వ్యవహార శైలి అలాగే ఉందని రాహుల్ విమర్శించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం కేవలం ఊహాల్లో మాత్రమే ఉందని, నిజానికి అలాంటిది ఏవి• లేదని రాహుల్ అన్నారు.
రాష్ట్రపతి భవన్ వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న తర్వాత మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళన చేస్తున్న రైతులు ఇళ్లకు వెళ్లరని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అసమర్థుడు అని, ఆయనకు ఏవి• అర్థం కావడం లేదని, కేవలం ముగ్గురు లేదా నలుగురు వ్యక్తుల కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నట్లు ఆరోపించారు. దేశ సరిహద్దుల వద్దే ఇంకా చైనా పొంచి ఉన్నదని, భారత భూభాగానికి చెందిన వేలాది ఎకరాల నేలను ఆ దేశం ఆక్రమించిందని, ఆ అంశంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. మరోవైపు ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.