‘‘మంకీపాక్స్, కాంగో ఫీవర్ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కొరోనా కష్ట కాలంలో తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. తద్వారా మన కుటుంబాలతో పాటు ఇతరులకూ వ్యాధి సోకకుండా చూసిన వాళ్ళం అవుతాము. మన వివరాలనూ వైద్యాధికారులకూ తెలియజేయాలి. ఆపత్కాలంలో ధైర్యంగా ఉండాలి. సామాజిక స్పృహతో బాధ్యతగా మెలగాలి. అప్పుడే సాంక్రమిక వ్యాధుల బారి నుంచి తప్పించు కోగలం.’’
వీటన్నింటికీ మూలం మనుషుల ఆలోచనలు, చర్యలే. 20019లో చైనా దేశంలోని వూహాన్ లో వెలుగు చూసిన కొరోనా మమమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లక్షల మంది చనిపోయారు. కొరోనా వైరస్ ..ఒకపెద్ద వైరస్ ల కుటుంబం. సాధారణ జలుబు మొదలుకొని, అత్యంత తీవ్రమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(%వీజు=•%), మరియు సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (%••=•%) లను కలిగిస్తాయి. రకరకాల మ్యూటేషన్లతో కొరోనా ప్రజలను భయపెట్టింది. ఆప్తులను బలిగొంది.
మన జుట్టులో ఉండే పేలలో ఉండే నైరో వైరస్ వల్ల కాంగో ఫీవర్ వ్యాప్తి చెందుతుంది. పశువుల ఈ వైరస్ ఉన్నా.. ఈ వైరస్ ఉన్న పేలు కుట్టినా ఇది సోకుతుంది. తలనొప్పి, జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస సమస్యలు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. దీనిని ప్రాణాంతక వైరస్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను హెచ్చరించింది.
ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఈ వ్యాధి సోకిన పశువులను వాటి పేలను సేకరించి పరిశోధన చేస్తున్నారు. అలాగే ఇది వ్యాప్తి చెందకుండా పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. ఇది చాలా త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న కారణంగా రక్షణ కిట్లను ధరించి మరీ కాంగో ఫీవర్ నియంత్రణకు ఇరాక్ దేశంలో ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు.
వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్