Take a fresh look at your lifestyle.

దేశంలో మళ్లీ పెరిగిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో 42,015 మందికి పాజిటివ్‌..3,509 ‌మంది మృతి
దేశంలో మంగళవారంతో పోల్చితే బుధవారం కొరోనా కేసులు పెద్దఎతున్నే పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42 వేల 15 మంది కొత్తగా వైరస్‌ ‌బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 12 లక్షల 16 వేల 337కు పెరిగింది. కొత్తగా కొరోనాతో 489 మంది చనిపోయారు. ఇక మహారాష్ట్ర రివైజ్డ్ ‌డేటా ఇవ్వడంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. మరో 3 వేల 509 మంది కొరోనాతో మరణించినట్లు గుర్తించామని తెలిపింది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షల 18 వేలు దాటింది.

ప్రస్తుతం దేశంలో 4 లక్షల 7 వేల 170 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 3 కోట్ల 3 లక్షల 90 వేల 687 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డెయిలీ పాజిటివిటీ రేటు వరుసగా 30వ రోజు 3 శాతం కన్నా తక్కువగా నమోదైంది. ప్రస్తుతం 2.27 శాతం గా ఉంది. ఇక ఇప్పటివరకూ 41 కోట్ల 54 లక్షల 72 వేల 455 వ్యాక్సిన్‌ ‌డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Leave a Reply