Take a fresh look at your lifestyle.

తేనె పూసిన కత్తి.. నూతన వ్యవసాయ బిల్లు

  • రైతుల జీవితాలతో కేంద్రం చెలగాటం
  • రైతులను ముంచి.. కార్పొరేట్‌ ‌గద్దలకు దోచిపెట్టేలా ఉంది
  • తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి•న సిఎం కెసిఆర్‌
  • ‌రాజ్యసభలో వ్యతిరేకించాలని ఎంపిలకు ఆదేశం
  • రైతాంగానికి నష్టం చేసేలా కేంద్రం చర్యలు..
  • టిఆర్‌ఎస్‌ ఎం‌పిల మండిపాటు

కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తిలా ఉందని సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు. బిల్లు రైతులకు అన్యాయం చేసేలా ఉందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బకొట్టి కార్పొరేటు వ్యాపారులకు లబ్ది చేకూర్చేలా ఉందన్నారు. రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా వోటు వేయాలని తెరాస ఎంపీలను ఆదేశించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే కేంద్రం రైతుల జీవితాలతో చెలగాట మాడుతోందని మండిపడ్డారు. రైతులు పండించే కొద్దిపాటి పంటను ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకునేందుకు అవకాశమే లేదని, దేశంలో చిన్న, సన్నకారు రైతులే అధికమని గుర్తు చేశారు. వాస్తవానికి రైతులు ఎక్కడికైనా వెళ్లి పంట అమ్ము కోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకులు కొనుగోలు చేసుకునేలా ఉంది. కార్పొరేట్‌ ‌గద్దలు దేశమంతా విస్తరించేలా అవకాశం కల్పిస్తున్న ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని సీఎం అన్నారు. ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50శాతం పన్ను అమలులో ఉంది. పన్నును 15 శాతానికి తగ్గించి దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

ఇలా చేస్తే తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. మన దేశంలోనే మక్కలు పుష్కలంగా పండుతోంటే సుంకం తగ్గించి దిగుమతి చేసుకోవాల్సి అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందన్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలన్నారు. ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలు ఉండగా దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70-75 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గియడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండే సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రశ్నించారు.

రైతాంగానికి నష్టం చేసేలా కేంద్రం చర్యలు..టిఆర్‌ఎస్‌ ఎం‌పిల మండిసాటు
అగ్రికల్చర్‌ ‌బిల్లుతో రాష్ట్రాలను నష్టపరిచే చర్యలకు కేంద్రం పాల్పడుతోందని టీఆర్‌ఎస్‌ ఎం‌పీ కే.కేశవరావు ఆరోపించారు. కాంట్రాక్టు వ్యవసాయం పేరిట రైతులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్లు వ్యవసాయంపై ఆధిపత్యం చలాయించే పరిస్థితి తీసుకొస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం సంక్షోభంలో పడేలా కొత్త బిల్లులు ఉన్నాయి. స్వదేశీ పంటలను గాలికొదిలేసి, విదేశీ పంటల దిగుమతులను ప్రోత్సహించడం సరికాదు. ఇతర దేశాల నుంచి మొక్కజొన్న, బియ్యాన్ని దిగుమతి చేసుకోవద్దని స్వదేశీ పంటలను ప్రోత్సహించాలన్నారు. విదేశీ పంటలపై దిగుమతి పన్నులు తగ్గించడం దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం. మార్కెట్‌ ‌కమిటీలు, మార్కెట్‌ ‌యార్డులు, గోదాముల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కేంద్రం ప్రోత్సహించాలని చూస్తోందన్నారు. మార్కెట్లు, వ్యవసాయ సంబంధిత అంశాలన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేవి. కొత్త బిల్లులతో కేంద్రం చేతిలోకి వెళ్లి రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుందని’ కేకే వివరించారు. దేశవ్యాప్తంగా రైతాంగం దెబ్బతినేలా ఆర్డినెన్సులు తెచ్చారని టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర్‌ ‌రావు అన్నారు. లోక్‌సభలో మెజార్టీ ఉందని బిల్లులు పాస్‌ ‌చేశారని మండిపడ్డారు. ‘బడా కంపెనీలకు మేలు జరిగేలా కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. పెద్ద కంపెనీలకు ప్రభుత్వ భూములను అప్పగించేందుకే కొత్త బిల్లులను కేంద్రం తీసుకొస్తోంది. రైతాంగానికి నష్టం చేకూర్చేలా ఉన్న బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటాం. రైతుల సంక్షేమానికి వ్యతిరేకంగా, రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలు తగదు. రాజ్యసభలో వాటిని వ్యతిరేకించి అడ్డుకుంటాం. ఈ బిల్లులతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విదేశీ రైతులకు మేలు చేసేలా దిగుమతి సుంకం తగ్గించారు’ అని నామా మండిపడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply