Take a fresh look at your lifestyle.

వ్యవసాయ బిల్లు రైతుల పాలిట గుదిబండ మంత్రి హరీష్‌రావు

కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ బిల్లు రైతుల పాలిట గుదిబండగా, శాపంగా మారిందని మంత్రి హరీష్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌మార్కెట్‌ ‌యార్డులో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని, మార్క్ ‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.హొఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌మాట్లాడు తూ.. రైతులు తేమశాతం తక్కువగా పత్తిని కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని కోరారు. నిజమైన రైతు బాగుండాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అన్నారు.
జిల్లాలో క్వింటాలుకు రూ.1800 మద్దతు ధరతో మొక్కజొన్నలు  కొనుగోళ్లు చేస్తామనీ,  జిల్లాలోని 9 మార్కెట్‌ ‌కమిటీ కేంద్రాల్లో 26 జిన్నింగ్‌ ‌మిల్లు కేంద్రాలలో పత్తి కొనుగోలు చేస్తామన్నారు.  జిన్నింగ్‌ ‌మిల్స్ ‌కూడా మార్కెట్‌ ‌యార్డులుగా నోటిఫైడ్‌ ‌చేసి, రెగ్యులర్‌గా విజిట్‌ ‌చేసి పత్తి రైతులకు మద్దతు ధర అందేలా అధికారులు ప్రతి జిన్నింగ్‌ ‌మిల్లులో పర్యవేక్షణ చేసి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.  పత్తిలో తేమ శాతం, తూకం మీద రైతు నష్ట పోకుండా చూడాలని, 8 శాతం తేమ ఉన్న పత్తికి బీబీ స్పెషల్‌ ‌గ్రేడ్‌ ‌కింద మద్దతు ధర రూ.5775 అందిస్తామనీ, 12 శాతం తేమ ఉంటే పత్తి రైతులకు మార్కెట్లో ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందని, మార్కెట్‌ ‌యార్డు వద్ద వేచి చూడాల్సి వస్తుందని, తేమ శాతం పెరిగితే.. రైతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పత్తి రైతులు ఆరబెట్టిన పత్తి తెచ్చి పూర్తిస్థాయిలో కొనుగోలు జరుపుకోవాలని కోరారు.

Leave a Reply