దేశవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఢిల్లీలో రైతుల ఉద్యమం గురించే చర్చ. గత 23 రోజులుగా ఎముకలు కొరికే చలిలో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ఏకైక లక్ష్యంగా ఆందోళన చేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దేశంలో ఇప్పటికే చాలా సంస్కరణలు వచ్చినా ఇంత పెద్ద ఉద్యమం వినరాలేదు. వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడుచట్టాలకు వ్యతిరేకంగా రైతులను ఎంతగానో ఆందోళన పరచే చట్టాలివే. (1) రైతుల ఉత్పత్తి వాణిజ్య చట్టం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) 2020. (2) రైతుల (సాధికారత మరియు రక్షణ) ధర భరోసా, వ్యవసాయ సేవల చట్టం 2020.
3) ఎసెన్షియల్ కమోడిటీ (సవరణ)చట్టం 2020.
రైతుల ఉత్పత్తి వాణిజ్యం, వాణిజ్య(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్)చట్టం వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీల ఆధ్వర్యంలోని మార్కెట్లకు, రాష్ట్రంలోని ఏ పి ఎం సి చట్టాల ప్రకారం నోటిఫై చేసిన ఇతర మార్కెట్లకు బయట క్రయ విక్రయాలకు అనుమతి ఇస్తుంది.
బయట వాణిజ్యంలో మార్కెట్ రుసుములు, సెస్ విధించకుండా రాష్ట్ర ప్రభుత్వాలను నిషేధిస్తుంది. ఇప్పటికే మార్కెట్ వెలుపల ప్రైవేటు వ్యక్తులు రైతుల దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు కొంటున్నారు.ఇప్పుడు మళ్లీ చట్టం తెచ్చి మరో అవకాశం ఇవ్వడం ఎవరి కోసమని రైతులడు గుతున్నారు. ఏ పి ఎం సి లలో అమ్మితేనే కనీస మద్దతుధర దొరకని ఈ పరిస్థితుల్లో బయట మార్కెట్లో అమ్మితే కనీస మద్దతుధర దొరుకు తుందా? మార్కెట్ బయట అమ్మకాలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్టంలో పండే పంటల ఉత్పత్తి లెక్కలు ఎలా తెలుస్తాయంటునినారు. ఏ పి ఎమ్ సిల ద్వారా ధాన్యాన్ని సేకరించక పోతే, పేదల ఆహారానికి ఆధారమైన ప్రజా పంపిణీకి ధాన్యం ఎక్కడినుంచి సేకరించాలి? రైతుల ప్రయోజనాల కోసం పని చేస్తున్న రాష్ట్రాలకు మార్కెట్ రుసుము, సెస్ ద్వారా వచ్చే ఆదాయం నుంచి రైతుల ప్రయోజనాల కోసం ఖర్చు చేసేవారు. ఇప్పుడు ఆ ఆదాయాన్ని కోల్పోయిన రాష్ట్రాలు రైతుల ప్రయోజనాలకోసం ఎలా ఖర్చు చేయగలవని అడుగుతున్నారు. మార్కెట్ యార్డ్ లు మూతపడితే దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటంటున్నారు. ఇది ఒకరకంగా ప్రభుత్వ మార్కెట్లను నిర్వీర్యం చేసి,ప్రైవేట్ మార్కెట్ల ద్వారా బడా కార్పోరేట్లకు పట్టం కట్టడమేనట. ?ఇప్పటికే విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు తదితర వ్యవసాయ ఇన్‌ఫుట్స్ అన్ని ప్రైవేటు ఆధీనంలో ఉండడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగ ఉత్పతులు, వ్యాపారాల్లో ప్రైవేటుకు అవకాశం ఇవ్వడంపై ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తి పెంపకానికి ముందు రైతు కొనుగోలుదారు మధ్య ఒప్పందం కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇప్పడు ఈ చట్టం అవసరం ఏమిటి? ఎవరి ప్రయోజనాలకోసం?
పంట ధరనిర్ణయ ప్రక్రియ, పంట ధర ఒప్పందంలో పేర్కొనాలి.
ఈ ఒప్పందం పై వివాదం వస్తే మూడు స్థాయిల్లో వివాద పరిష్కార మార్గాల్ని సూచిస్తుంది. దానిపై సివిల్ కోర్టుకు పోవడానికి వీలు లేదు. చట్టంలో ప్రధానమైన లోపాలు విశ్లేషిస్తే, , కంపెనీ చెప్పిన పంట వేయాలి, చెప్పిన మోతాదుల్లో రసాయన ఎరువులు,పురుగు మందులు వాడాలి. ఒప్పందంలో పేర్కొన్న ధర చెల్లించని కంపెనీ పై చేసే పోరాటంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇంకో ప్రధాన లోపమేమిటంచే, అధికారులు సదుద్దేశంతో మంచి నిర్ణయాలు తీసుకున్నా ,ఆ నిర్ణయాలే తుది తీర్పు. అధికారులు ఎవరి పక్షాన నిర్ణయాలు తీసుకుంటారు, రైతుల వైపా? కార్పోరేట్ల వైపా అనేది ఊహించవచ్చు. ఉద్యాన పంటల ఉత్పత్తులకు 100% ధర పెరిగినప్పుడు,కొద్ది రోజుల్లోనే కుళ్ళిపోనీ ఆహార పంటలకు(ధాన్యాలకు)50% ధర పెరిగినప్పుడు మాత్రమేవప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఈ మూడు చట్టాలు కేవలం కార్పోరేట్లకు వ్యవసాయదారుల శ్రమను దోచిపెట్టేందుకే అని స్పష్టంగా అర్థం అవుతుంది?ఇటువంటి సందర్భాల్లో రైతులు ఉద్యమం చెయ్యక ఏంచేస్తారు.

టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్‌నగర్, 9494019270