Take a fresh look at your lifestyle.

బాధ్యతలు స్వీకరించిన నూతన అదనపు కలెక్టర్‌ (‌లోకల్‌ ‌బాడీస్‌)

‌సూర్యాపేట, జులై 16, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలో రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేస్తానని నూతన అదనపు కలెక్టర్‌ (‌లోకల్‌ ‌బాడీస్‌) ‌జి.పద్మజ రాణి అన్నారు.

గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతు మొదట 1995సంవత్సరంలో డిప్యూటి తహశీల్దార్‌గా మెదక్‌ ‌జిల్లాలో, స్పెషల్‌ ‌డిప్యూటీ కలెక్టర్‌, ‌జిల్లా పరిషత్‌ ‌సీఈఓగా కరీంనగర్‌లో, జిల్లా రెవెన్యూ అధికారిగా వనపర్తిలో విధులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల లోకల్‌ ‌బాడీస్‌ అదనపు కలెక్టర్లుగా నియమించడంతో పదోన్నతిపై సూర్యాపేట జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply