Take a fresh look at your lifestyle.

16 ‌నుంచి కొత్త విద్యా సంవత్సరం

  • ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు
  • కొరోనా తగ్గుముఖం పట్టడంతో ఏర్పాట్లు

రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16 నుంచి కొత్త విధ్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. 8 నుంచి 10వ తరగతి, ఇంటర్‌ ‌విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌క్లాసులు తీసుకోనున్నారు. గతేడాదిలాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కొరోనా తగ్గు ముఖం పడితే వొచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. జులై నెలాఖరు వరకు కొరోనా తగ్గు ముఖం పడుతుందని..స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే టెన్త్, ఇం‌టర్‌ ‌పరీక్షలను రద్దు చేసి ఏకంగా ఫలితాలు ప్రకటించారు. అలాగే పాఠశాల స్థాయిలో కూడా పరీక్షలు రద్దు చేశారు. వరుసగా రెండో యేడు కూడా దుర్భర పరిస్థితులు ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే కొరోనా వేవ్‌ ‌తగ్గడంతో ఉన్నత తరగతులకు క్లాసులు ప్రారంభించాలని ఆలోచన చేస్తునారు.

Leave a Reply