Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొత్తగా 1771 పాజిటివ్‌ ‌కేసులు కొరోనాతో 13 మంది మృతి

రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1771 మందికి పాజిటివ్‌గా నమోదు కాగా, వైరస్‌ ‌నుంచి 2384 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 13 మంది మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 171 కేసులు నమోదవగా, నల్గొండ జిల్లాలో కొత్తగా 157 కేసులు, ఖమ్మంలో 149 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,02,089 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,469కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,76,487 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 21,983గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply