తెలంగాణలో కొత్తగా..1,256 కొరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కొత్తగా 62.064 కేసులు..
గత 24 గంటల్లో 1,007 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా 2కోట్లు దాటిన బాధితులు..
మృతుల సంఖ్య 7,33,973కి చేరిక
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,256 కొరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 389 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కి చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 637కి చేరింది. ప్రస్తుతం 22,528 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 11,609 నమూనాలను పరిశీలించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 6,24,840 నమూనాలు పరీక్షించినట్లు వివరిం చింది. ఇంకా 1,700 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. తాజాగా 1,587 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 57,586 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 71.31 శాతంగా ఉందని, ఇది దేశ సగటుకు కంటే ఎక్కువ అని పేర్కొంది. దేశంలో కొరోనా రికవరీ రేటు 68.78గా ఉంది. మరో 15,789 మంది •ం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.దేశంలో ఆగని కరోనా వైరస్ విజృంభణ దేశ వ్యాప్తంగా కొత్తగా 62.064 కేసులు.. గత 24 గంటల్లో 1,007 మంది మృతి.. దేశంలో కొరోనా వైరస్ విజృంభిస్తున్నది. వరుసగా నాలుగో రోజు 62 వేలకు పైగా పాజిటివ్ కేసులతోపాటు, ఎనిమిది వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
తాజాగా రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా కొరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాలు 44 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,007 మంది బాధితులు మరణించారు. ఇంతపెద్ద సంఖ్యలో వైరస్ బాధితులు మరణించడం ఇదే మొదటి సారి. అదేవిధంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 62,064 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దీంతో దేశంలో కొరోనా కేసుల సంఖ్య 22,15,075కు పెరగగా, మరణాలు 44,386కు చేరాయి. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో కొరోనా బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 లక్షలు దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 80 శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆదివారం వరకు 2,45,83,558 కొరోనా టెస్టులు చేశామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఆగస్టు 9న 4,77,023 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా 2కోట్లు దాటిన కేసులు..మృతుల సంఖ్య 7,33,973కి చేరిక
ప్రపంచవ్యాప్తంగా కోరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. ఏకంగా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది… ఇక, ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారత్‌లోనే కొరోనా కేసులు సంఖ్య స్పీడ్‌గా దూసుకెళ్తోంది. కొరోనా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2,00,23,016కు చేరగా.. ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 7,33,973కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 3 లక్షల కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు, కొరోనాబారినపడి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా.. ఇప్పటి వరకు 1,28,97,813 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. అమెరికాలో ఇప్పటివరకు 51,99,444 మంది వైరస్ బారినపడ్డారు. వారిలో 26,64,701 మంది కోలుకున్నారు. 23,69,126 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, ఇప్పటివరకు 1,65,617 మంది ప్రాణాలు కోల్పోయారు.