Take a fresh look at your lifestyle.

40 ఏం‌డ్లలో ఎన్నడూ లేనంతగా.. భారీ మాంద్యంలో దేశ అర్థిక వ్యవస్థ

వీడియో సీరిస్‌ను విడుదల చేసిన రాహుల్‌

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ వీడియో సిరీస్‌ ‌ప్రారంభించారు. మొదటి వీడియోను సోమవారం నాడు ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక విషాదం ఈ రోజు ధృవీకరించబడుతున్నది. భారత ఆర్థిక వ్యవస్థ 40 ఏండ్లలో తొలిసారిగా భారీ మాంద్యంలో ఉంది. అవమానం దేవుణ్ణి నిందిస్తోంది’ అంటూ కామెంట్‌ ‌పోస్ట్ ‌చేశారు. వీడియో సిరీస్‌లో భాగంగా 3.38 నిమిషాల నిడివిగల తొలి వీడియోలో రాహుల్‌ ‌మాట్లాడుతూ.. డీమోనిటైజేషన్‌, ‌తప్పుడు జీఎస్టీ విధానం, లాక్డౌన్‌ ఆర్థిక వ్యవస్థపై దాడికి మూడు పెద్ద ఉదాహరణలుగా గత 4 నెలల్లో 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

అసంఘటిత రంగంలో 40 కోట్ల మంది కార్మికులు సంక్షోభంలో చిక్కుకున్నారు’ అని చెప్పారు. ‘ప్రభుత్వాన్ని నడపడానికి ప్రధానమంత్రికి డియా అవసరం, మార్కెటింగ్‌ అవసరం. డియా-మార్కెటింగ్‌ 15-20 ‌మంది చేస్తారు. అనధికారిక రంగంలో మిలియన్ల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రంగాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా ప్రజల డబ్బు తీసుకోవాలనుకుంటున్నారు. ఫలితంగా హిందుస్తాన్‌ ఉపాధిని పొందలేకపోతున్నది. ఎందుకంటే అనధికారిక రంగం 90 శాతం కంటే ఎక్కువ మందికి ఉపాధిని అందిస్తుంది’ అని రాహుల్‌ ‌గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరుతెన్నులు, మోదీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply