Take a fresh look at your lifestyle.

యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ‌షాక్‌

‌షేరింగ్‌ ‌పాస్‌వర్డ్‌పై కీలక నిర్ణయం
న్యూదిల్లీ, మే24 :ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ ‌తన యూజర్స్‌కు భారీ షాకిచ్చింది. ఎకౌంటు పాస్‌వర్డ్ ‌షేరింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్‌ ‌చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతరులతో పాస్‌వర్డ్ ‌షేర్‌ ‌చేసుకుంటే అదనపు ఛార్జెస్‌ ‌చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త నిబంధనఇండియాలో ఎప్పటి నుండి అమల్లోకి రానుంది అనే విషయంపై మాత్రంఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం ఈ విధానాన్ని కొన్ని సెల్టకెడ్‌మార్కెట్స్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు నెట్‌ప్లిక్స్ ‌తెలిపింది.

వాటికి సూపర్‌ ‌రెస్పాన్స్ ‌రావడంతో..  ఇప్పుడు అమెరికా సహా వందకు పైగా దేశాల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి నెట్‌ప్లిక్స్ ‌పాస్‌వర్డ్ ‌షేరింగ్‌కు వ్యతిరేకం కాదు. 2017లో స్వయంగా కంపెనీయే పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవచ్చని, లవ్‌ ఈజ్‌ ‌షేరింగ్‌ ‌పాస్‌వర్డ్ అని  ప్రచారం కూడా చేసింది. కానీ కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యూజర్స్ ఆల్టర్నేటీవ్‌ ఓటీటీ లాట్‌ఫామ్స్ ‌కు మారిపోయారు. అందుకే కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే పాస్‌వర్డ్ ‌షేరింగ్‌కు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. మరి ఈ కొత్త నిర్ణయానికి  యూజర్స్ ‌నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

Leave a Reply