Take a fresh look at your lifestyle.

నేతాజీ స్ఫూర్తిగా సమసమాజ నిర్మాణం సాగాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు
‌నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక, లింగవివక్ష, కులతత్వం, మతతత్వం వంటి సామాజిక దురాచారాలు లేనటువంటి సమాజ నిర్మాణం దిశగా యువత కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్‌ ‌చంద్ర బోస్‌ 125‌వ జయంతిని పురస్కరించుకుని ’పరాక్రమ దివస్‌’ ‌నేపథ్యంలో హైదరాబాద్‌లోని డాక్టర్‌ ‌మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని  సందర్శించి అక్కడ శిక్షణ పొందుతున్న అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.
అంతకు ముందు నేతాజీ చిత్రం వద్ద నివాళులు అర్పించారు. మన దేశ జనాభాలో 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారని, ప్రతి పౌరుడు సమాన అవకాశాలను పొందే, వివక్షకు తావులేని సంతోషకరమైన, సుసంపన్నమైన నవభారత నిర్మాణంలో పాలు పంచుకునే దిశగా ముందుకు రావాలని సూచించారు. నేతాజీ వ్యక్తిత్వంలో పరాక్రమం ప్రతిబింబిస్తుందని, ఆయన జయంతిని దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించే విధంగా పరాక్రమ దివస్‌గా జరుపుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. స్వాతంత్యోద్య్ర మంలో నేతాజీ పోషించిన పాత్ర నిరుపమానమైనదని, కులం, మతం, ప్రాంతం, భాష వంటి ఇతర గుర్తింపులకు అతీతంగా మనమంతా భారతీయులమని బోస్‌ ‌ప్రగాఢంగా విశ్వసించారని తెలిపారు.
కుల వ్యవస్థలేని భారతదేశాన్ని నేతాజీ ఆకాంక్షించారని నొక్కి చెప్పారు. 1940 ల్లోనే అన్ని కులాలు, మతాలకు చెందిన సైనికులంతా కలిసి ఒకే రకమైన వంటలతో సహపంక్తి భోజనాలు చేసే దిశగా ఆయన స్ఫూర్తిని రగిలించారన్నారు. నేతాజీ స్ఫూర్తిదాయక లక్షణాలను ప్రస్తావిస్తూ.. యుద్ధ ఖైదీలుగా ఉన్న సైనికులను ఉత్సాహపరచి, వారిలో స్ఫూర్తిని రగిలించి స్వాతంత్య ్రసమరయోధులుగా మలచారని, నేతాజీ లాంటి నాయకుడి కోసం వారంతా స్వరాజ్య సాధన కోసం తుది శ్వాస వరకూ పోరాడేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్‌ ‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌హర్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, అదనపు డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌బెన్‌హుర్‌ ‌మహేష్‌ ‌దత్‌ ఎక్కా, అధ్యాపక సిబ్బంది, శిక్షణ పొందుతున్న అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply