Take a fresh look at your lifestyle.

డబ్బు కోసం మేనత్తను హత్య చేసిన మేనల్లుడు

హన్మకొండ టైలర్‌ ‌స్ట్రీట్‌ ‌ప్రాంతంలో హత్యకు గురైన మహిళ కేసులోని ముగ్గురు నిందితులను బుధవారం హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి బంగారు ఆభరణాలతో పాటు రూ.2లక్షల71వేలు, మూడు సెల్‌ ‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిపి పి.ప్రమోద్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ ప్రధాన నిందితుడు ఆడెపు ఆకాశ్‌ ‌బాబు (20)  ఎస్‌ఆర్‌ఆర్‌, ‌కరీంబాద్‌ ‌రోడ్‌, ‌వరంగల్‌, ‌బాల నేరస్థుడు, మేకల మచ్చేందర్‌ (19) ‌బాలసింగారం రోడ్‌, ‌పోచంపల్లి, యాదాద్రిలు ఈనెల 3 తెల్లవారుజామున హన్మకొండ టైలర్‌ ‌స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న దోర్నం శారద (38) హత్యతో పాటు, మృతురాలి కుమారుడు దోర్నం అఖిల్‌ (17)‌పై జరిగిన హత్యాయత్నం జరిగిన సంఘటనపై వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు సెంట్రల్‌ ‌జోన్‌ ఇం‌చార్జ్ ‌డిసిపి పుష్పా ఆదేశాల మేరకు హన్మకొండ ఎసిపి జితేందర్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాల ఆధ్వర్యంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.

అరెస్టు చేసిన నిందితులను విచారించగా మృతురాలు శారద తన భర్త మరణించడంతో తన కూతురు, కుమారుడు అఖిల్‌ ‌తో కలిసి హన్మకొండలోని టైలర్‌ ‌స్ట్రీట్‌ ‌ప్రాంతంలో నివాసం ఉంటూ జీవనోపాధి కోసం తాను నివాసం ఉంటున్న ఇంటి కిందే కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంది. మృతురాలు కూతురు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ ‌చదువుతుండగా, కుమారుడు నిఖిల్‌ ‌మృతురాలితో కలిసి ఉంటూ ఇంటి వద్దనే ఉంటూ ఇంటర్మీడియట్‌ ‌చదువుతున్నాడు. మృతురాలు తన కూరగాయల వ్యాపారం ద్వారా వచ్చే అదాయం తన ఇంటిలోని బీరువా భద్రపర్చుడం చేసేది. మృతురాలి అన్న కొడుకు ప్రధాన నిందితుడైన ఆడెపు ఆకాశ్‌ ‌బాబు మిగితా ఇద్దరు నిందితులతో కలిసి చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో పాటు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు సేవించడంతో నిందితుడుని తండ్రి మందలి•చడంతో నిందితుడు తన మేనత్త అయిన మృతురాలి ఇంటిలో కొద్ది రోజులు ఆశ్రయం పొందాడు. ఇదే సమయంలో మృతురాలు తన కూమార్తె వివాహం కోసం తన ఇంటిలోని బీరువాలో డబ్బు, నగలను భద్రపర్చడాన్ని నిందితుడు గమనించేవాడు. ఇదే క్రమంలో పధాన నిందితుడు ఆడెపు ఆకాశ్‌ ‌బాబు తన చెడు వ్యసనాలకు అవసరమయిన డబ్బు లభించక పోవడంతో ఏ విధంగానైనా సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. ఇందులో భాగంగా తన మేనత్త ఇంటిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని అ డబ్బును దొంగలించడం ద్వారా తన అవసరాలను తీర్చుకోవచ్చని ప్రణాళిను రూపొందించుకు న్నాడు. ఈ నెల 3 తెల్లవారుజామున 3గంటల సమయంలో మృతురాలని ఇంటి వెనుక తలుపు తీసి ఉండటంతో దాని ద్వారా ఇంటిలోకి ప్రవేశించి మెలుకుతో ఉన్న తన మేనత్తపై నిందితుడు ఒక్కసారిగా బండరాయితో దాడిచేసి బండరాయితో మృతిరాలి తలపై పలుమార్లు కొట్టి హత్య చేశాడు. అక్కడే గాఢ నిద్రలో ఉన్న మృతురాలు కుమారుడు నిఖిల్‌ ‌పై నిందితుడు బండరాయితో దాడి చేసి హత్యయ త్నంకు చేశాడు. అనంతరం నిందితుడు గదిలో వున్న బీరువా లోని బంగారు నగలు, డబ్బును చోరీ చేశాడు. నిందితుడు గదిలోని బీరువా ఉండటంతో మృతురాలు మరణించినట్లుగా నమ్మించేందుకుగాను బీరువాలో కొద్ది మొత్తంలో డబ్బును ఉంచి బీరువాను మృతురాలు, తీవ్రంగా గాయపడిన వున్న మృతురాలి కుమారుడు నిఖిల్‌ ‌పై పడేసి నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు.

అనంతరం మిగితా ఇద్దరు నిందితులను సంప్రదించడంతో ఆ ఇద్దరు నిందితులు ప్రధాన నిందితుడు ఆడెపు ఆకాశ్‌ ‌బాబుకు ఆశ్రయం కల్పించారు. చోరి చేసిన సొత్తు నుండి బాల నేరస్థుడు 51వేలు, మేకల మచ్చేందర్‌ ‌రూ.ఒక లక్ష 50 వేలు తీసుకున్నారు. హత్య అనంతరం పోలీస్‌ ‌ప్రత్యేక బృందాలు నేరం జరిగిన ప్రాంతంలోని సిసి కెమరాలతో పాటు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వినియోగించుకోని దర్యాపు బృందాలు నిందితులను గుర్తించారు. పక్కా సమాచారం రావడంతో బుధవారం ఉదయం కెయుసి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని వినాయక నగర్‌, ఎజిఆర్‌ ‌గార్డెన్‌ ‌వద్ద అద్దెఇంటిలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి ప్రధాన నిందితుడి నుండి రూ.63వేల9వందల నగదు, చేవి అభరణలు, బాలనేరస్థుడు నుండి రూ.51వేలు, మరోనిందితుడు మేకల మచ్చేందర్‌ ‌నుండి రూ.ఒక లక్ష 50 వేలతో పాటు మూడు సెలఫోన్లు హత్యకు వినియోగించిన బండరాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆడెపు ఆకాశ్‌ ‌బాబు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో సిసి కెమెరాలను ద్వంసం చేసిన కేసులో నిందితుడు. ఈ హత్య కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌ ‌జోన్‌ ఇం‌చార్జ్ ‌డిసిపి పుష్పా, హన్మకొండ ఎసిపి జితేందర్‌ ‌రెడ్డి, సుబేదారి ఇన్స్‌స్పెక్టర్‌ అజయ్‌, ‌హన్మకొండ, సుబేదారి ఎస్‌ఐలు శ్రీనివాస్‌, ‌వేణుగోపాల్‌తో పాటు ఇతర సిబ్బందిని పోలీస్‌ ‌కమిషనర్‌ అభినందించారు.

Leave a Reply