Take a fresh look at your lifestyle.

ఫీల్డ్ అసిస్టెంట్లతో చర్చలు జరపాలి

అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉపాధి హామి పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ ‌లై చేసిన వాక్యాలు వెంటనే ఉపసంహారించుకోవాలని ఎఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్‌ అన్నారు. 7వ రోజు సమ్మెలో భాగంగా రెబ్బెన మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్‌ ‌సమ్మెకు ఏఐటియూసి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.

రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌ఫీల్డ్ అసిస్టెంట్లు చేస్తున్న సమ్మె పై భాద్యతరహితంగామాట్లాడటం సరైనది కాదని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అసలు ఉద్యోగులే కాదని ముఖ్యమంత్రి అనడం చాలా భాదకరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు తుకారం,తిరుపతి,వెంకటేష్‌,‌మొగిలి,స్వప్నలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!