రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ
జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యుల హాజరు వివరాలు, బయోమెట్రిక్ విధానం అమలు వంటి విషయాలు, సిబ్బంది వివరాలు కల్టెకర్ పరిశీలించారు. వైద్యం కొరకు వచ్చిన, వార్డుల్లో చికిత్స చేయించుకుంటున్న రోగులతో ఆమె మాట్లాడి వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు.
ఆసుపత్రిలోని ఆపరేషన్ థియెటర్, ఎమర్జేన్సీ వార్డు, డాక్టర్ల గదులను, ఔట్ పేషేంట్ల వివరాలు, నిలువ ఉన్న మందుల వివరాలను కలెక్టర్ పరిశీలించారు. సమ్మక్క జాతర కారణంగా ఓపికి రోగుల సంఖ్య తగ్గినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరిం చారు. ఆసుపత్రిలో గర్భీణుల వార్డును పరిశీలించి అర్హులైన వారికి కేసిఆర్ కిట్లను అందించా రు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైరల్ జ్వరాలు ఒకరి నుండి మరొకరికి వచ్చే అవకాశం ఉన్నందున ఆసుపత్రిలో పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి సారించాల న్నారు. కరోనా వైరస్ వ్యాధి ప్రపంచంలో అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరిఖనిలో కరోనా వైరస్ లక్షణాలు కల్గిన వ్యాధిగ్రస్తులను హైదరాబాద్ లో పరీక్షలు నిర్వహించ గా సాధారణ వైరల్ జ్వరం అని తేలిందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జిల్లా ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం త్వరగా ప్రజలకు అందుబాటు లోకి వచ్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డిఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, వైద్యధికారులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Tags: negligent patients,collector sikta Patnaik presenting KCR kit