Take a fresh look at your lifestyle.

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌, 17 ‌జూన్‌( ‌ప్రజాతంత్ర ప్రతినిధి): సర్పంచ్‌ ‌కార్యదర్శులు గ్రామాలలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పారిశుధ్యం పై అలస త్వం వహిస్తే  సంబంధిత  వారిపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌వెంకట రావు అన్నా రు.బుధవారం ఆయన కలెక్టర్‌ ‌కార్యాలయం నుండి జిల్లాలోని అందరు సర్పంచులు, పంచాయితీ కార్యద ర్శులు, పంచాయతీ రాజ్‌ ఇం‌జనీరింగ్‌ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు ,ఏపీవోలు,ఈసిలు,టిఏ లు తదితరులతో వెబ్‌  ‌వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.పారిశుద్ద్యం పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ ని కలెక్టర్‌ ‌హెచ్చరించారు .ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 10గంటల వరకు గ్రామంలో శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. నెలనె లా చెల్లించే ట్రాక్టర్‌ ‌రుణ వాయిదాలు, అదేవిధంగా విద్యుత్‌ ‌బిల్లులు బకాయిలు తక్షణమే చెల్లించాలి.

వైకుంఠ దామాలను  45 రోజులలో పూర్తి చేయాలి
వైకుంఠ దామాలు, డంపింగ్‌ ‌యార్డులు, చెత్త వేరు చేసే షెడ్డులకు ప్రహరి నిర్మాణాలు చేపట్టకుండా మొక్కలతోనే ప్రహరీలు నిర్మించాలి. రైతులు పండిన పంట నూర్పిడి చేసుకొనేందుకు ప్రతి నియోజకవర్గం లో 1000 కల్లాల  ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. సుమారు 56 వేల రూపాయలతో ఈ కళ్లాల నిర్మాణం చేపట్టాలి .ఉపాధి హామీ, వ్యవసా యశాఖ నిధులతో పనులు చేపట్టాలి.దరఖాస్తులు రాగానే తక్షణమే  సమయంతో  సహా ఎక్సెల్‌ ‌షీట్‌ ‌లో వివరాలను నింపి సమర్పించాలి.మూడు నెలల్లో రైతు కల్లాల నిర్మాణాలను పూర్తి చేయాలి జిల్లాలో నిర్మించను న్న 88 రైతు వేదికలను ఉపాధి హామీ పథకం నిధులతో  ఆనుసంధానం చేసుకొని నిర్మించాలి.కల్లాలు,రైతు వేదికలను కాంట్రాక్టర్‌ ‌లేకుండా నిర్మించాలి.ఇరిగేషన్‌ ‌కెనాల్స్, ‌చెరువులలో మట్టి తీసే కార్యక్రమాన్ని ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలి.ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల  సర్పంచులు, కార్యదర్శు లు, వార్డు సభ్యులకు కూడా వెంటనే శిక్షణ ఏర్పాటు చేయాలి.ఈ నెల 25న అన్ని గ్రామ పంచాయతీల లో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలిఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అందర్నీ భాగస్వాములను చేయాలి.హరితహారం కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి వార్షిక, పంచవర్ష ప్రణాళిక తో పాటు  పంచాయతీకార్డులు తయారు చేయాలి. ఈనెల 21లోగా గ్రామ పంచాయ తీ స్థాయిలో గ్రామపంచాయతీ కార్డును, 25 లోపు  మండల కార్డును తయారు చేయాలి . గ్రామ పంచాయ తీ కార్డు వనరులు,రాబడి,ఖర్చు లతో కూడుకొని ఉండాలినకిలీ విత్తనాల  సమాచారాన్ని  తక్షణమే పంచాయతీ కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారి కి తెలియజేయాలి.అలాగే అనుమతులు లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నట్లయితే  ఆ సమాచారం కూడా అందించాలిపంచాయితీ సర్పంచులు, కార్యదర్శులను కూడా ఇసుక విషయం లో బాధ్యులను చేస్తాము.ఇసుక రీచ్‌ ‌లు ఉన్న ప్రతి గ్రామంలో ఒక గ్రామ కమిటీని ఏర్పాటు చేస్తాంమియావాకి అడవుల పెంపకం కాకుం డా యాదాద్రి తరహా అడవుల నిర్మాణాలను చేపట్టాలి అడవుల పునరుధ్హరణ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి    అదనపు కలెక్టర్లు సీతారామారావు, మోహన్లాల్‌, ‌డిపిఓ వెంకటేశ్వర్లు ,జడ్పీ సీఈఓ యాదయ్య, డి ఆర్‌ ‌డివోవెంకట్‌ ‌రెడ్డి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌కు హాజరయ్యారు.

Leave a Reply

error: Content is protected !!