Take a fresh look at your lifestyle.

మహిళా కమిషన్‌ ఏర్పాటులో నిర్లక్ష్యం

  • మహిళలంటే సిఎంకు చిన్నచూపు
  • ఏర్పాటుకు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో డిమాండ్‌
‌ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహిళలంటే చిన్న చూపు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. తెలంగాణ మహిళా కమిషన్‌ ‌కోసం ఏర్పాటు చేసిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో సీతక్క పాల్గొని మాట్లాడారు. ‘మహిళల సమస్యల కోసం ఒక  జేఏసీ ఏర్పాటు కావాలి. అన్ని పార్టీల మహిళా విభాగాల ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలుస్తాం. మహిళలను తొక్కేయడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటి రారని మండిపడ్డారు. తెలంగాణ మహిళా కమిషన్‌ ‌కోసం బలమైన ఉద్యమం చేయాలి. బతుకమ్మ పేరు కవితమ్మకు మాత్రమే రావాలని కేసీఆర్‌ ‌పరితపించారు. మహిళల జీవితాలను కేసీఆర్‌ ‌బాగు చేస్తారన్న నమ్మకం లేదు. తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్‌ ‌తప్పులు మరుగున పడిపోతున్నాయి.  నేను తెలుగుదేశం పార్టీలో ఎదిగిన మొక్కను. తెలుగుదేశం పార్టీ నా రాజకీయ పుట్టినిల్లు’ అని అన్నారు. మహిళలున్నది బతుకమ్మ చీరలు తీసుకోవటానికి మాత్రమే కాదని కేసీఆర్‌ ‌తెలుసుకోవాలని  కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కల్వ సుజాత పేర్కొన్నారు. మహిళా కమిషన్‌ ‌తెలంగాణ ఆడబిడ్డల హక్కు అన్నారు. రాష్ట్రంలో ఆడవాళ్ళ సమస్యలపై  మగవాళ్ళే మాట్లాడటం విచారకరమన్నారు.
భర్తల మాటలు విని..టీఆర్‌ఎస్‌కు వోటు వేసినందుకు మహిళలు బాధపడ్తున్నారని కల్వ సుజాత పేర్కొన్నారు. రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో సినీ ఇండస్టీప్రై నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీరంగంలో సైతం మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇండస్ట్రీలో పెద్దపెద్ద వాళ్ళ పిల్లలు సైతం డ్రగ్స్‌కు అలవాటు పడ్డారన్నారు. వివిధ అవసరాల కోసం దిగజారే రకాలు సినీరంగంలో ఉన్నారన్నారు. డ్రగ్స్ ‌కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలన్నారు. వివిధ రంగాల్లో ఉన్నట్లే.. సినీరంగంలో కూడా డబ్బు ఉన్నవాళ్ళదే రాజ్యమన్నారు. రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌కు ఉన్నదేంటి? ప్రణీతకు లేనిదేంటని ప్రశ్నించారు. పెద్ద హీరోలతో నటించకపోవటానికి, ఎక్కువ సినిమాలు చేయకపోవటానికి వివిధ  కారణలున్నాయన్నారు. తన కూతుతు చదువుతోన్న మాసబ్‌ ‌ట్యాంక్‌ ‌ఫైన్‌ ఆర్టస్ ‌కాలేజీలో సైతం డ్రగ్స్‌కు అలవాటు పడిన విద్యార్థులున్నారని దివ్యవాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌.‌రమణ మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళా కమిషన్‌  ఏర్పాటుపై గవర్నర్‌ ‌జోక్యం చేసుకోవాలన్నారు. మహిళా కమిషన్‌ ‌లేకపోవటం వలనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు. ఈ సమావేశానికి ఇంకా టీటీడీపీ నేతలు జ్యోత్స్నా, బీజేపీ గీతామూర్తి, ఎల్‌. ‌రమణ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply