Take a fresh look at your lifestyle.

ఓ ‌నీలి అంబరమా!

అంబరమా ఓ నీలి అంబరమా
అవనికి నీవు అందమా
అందకుండా వుంటేనే అందము!
అందకుండా వుండేది గగనము!
మిళ మిళ మెరిసే ఆ చుక్కలు
రెక్కలు కట్టుక రమ్మంటాయి
చిరునవ్వులు చిందే ఆ తారలు
నీ ముంగిట్లో రంగవల్లులు!
నీలి నీలి ఆ నింగి
అవని వైపు వంగి
అందినట్లే ఉంటుంది
అంతలోనే ఎందుకో
అందకుండా పోతుంది
పగలేమో ఆదిత్యుని వెలుగులో
వెలిగి పోతావు
రాత్రి అయితే చాలు
ఆ తారలు చంద్రుడు
నీ ఒడిలో ఆడుకుంటారు
ఒక్కరోజు నీవు కనబడకుంటె
మా మనసంతా చిన్నబోవు
మేఘాలను బ్రతిమిలాడి
తెర తీయు మంటాము
నిశ్చలమైన ఆ గగనానికి
ఇంద్రధనుస్సు నిచ్చెనలు వేద్దామా!
నీలోన ఎన్నెన్నో ఘన చరిత్రలు
దాచుకున్నావు
దోచుకుంటారని
నీలి రంగు తెర వేసుకున్నావు
నీ వెంత దూరమున్న
మాకు అంత దగ్గర!
మా మది మనో నేత్రం ముందు
కనుచూపు దూరమే!
అణు యుగం లో వున్నా
అవగతమైంది అణువంతే !
ఆ పాలపుంత మరలోక వింత!
ఆలకిస్తే గగనమంతా వింతే!
విశ్వసృష్టికి పురుడు పోసిన
దుష్టవు నీవు!
అంబరమా ఓ నీలి అంబరమా
అవనికే నీవు అందమా!

– పి.బక్కారెడ్డి
                              9705315250

Leave a Reply