Take a fresh look at your lifestyle.

కొత్త ఎస్‌ఈసీగా నీలంసాహ్ని నేడు ప్రమాణం

వెంటనే ఎంపిటిసి,జడ్పీటీసీల పక్రియకు శ్రీకారం ?
కొత్త ఎస్‌ఈసీగా నీలంసాహ్నిగురువారం  పదవీ బాధ్యతలు స్వీకరించ నున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఆమె నిర్ణయం తీసుకోనున్నారు. పది రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 8‌వ తేదీన ఎన్నికలు.. 10న ఫలితాలు విడుదల చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో ప్రభుత్వ అధికారుల సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ఏపీ కొత్త ఎస్‌ఈసీని ప్రభుత్వం నియమించింది. మాజీ సీఎస్‌ ‌నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. దీనిని గవర్నర్‌ ఆమోదించారు. ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ‌పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఎస్‌ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్‌ ‌పేర్లను ప్రతిపాదించింది. చివరికి సాహ్నిని ఎంపిక చేశారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను ప్రధాన సలహాదారుగా నియమించారు. సాహ్ని రెండేళ్ల పాటు సలహాదారుగా ఉంటారు. అయితే అంతలోనే అనూహ్యంగా ఎస్‌ఈసీగా నియమించడం గమనార్హం. కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేసినవెంటనే… పెండింగ్‌ ‌లో ఉన్న పరిషత్‌ ఎన్నికల పక్రియను ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు ముగియగా.. ఇప్పుటుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనే పడింది. కాగా, తన హయాంలో ఎన్నికలు నిర్వించలేకపోతున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ‌ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ఎస్‌ఈసీ ఆధ్వర్యంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయనేదానిపై క్లారిటీ రాగా… రేపే నోటిఫికేషన్‌ ‌వస్తుందని చెబుతున్నారు.

Leave a Reply