Take a fresh look at your lifestyle.

కొత్త కరెన్సీ ముద్రణ అవసరమా?

“అధికంగా కరెన్సీని ముద్రించడాన్ని టెక్నికల్‌ ‌భాషలో ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ అం‌టారు. అంటే, స్థూలంగా కరెన్సీ లభ్యతను పెంచడమని అర్థం. ప్రపంచంలోని చాలాదేశాల్లో ఈ పద్ధతిని అవలంబించారు. అమెరికా ఫెడరల్‌ ‌రిజర్వ్ ఇటీవల దీనిని విజయవంతంగా అమలు చేసింది. కానీ వెనెజ్వెలా, జింబాబ్వే లాంటి దేశాల్లో ఈ చర్యల వల్ల చాలా ప్రమాదకరమైన పరిణామాలు తలెత్తాయి.”

దేశ ఆర్థిక వ్యవస్థ కొరోనా మొదటి వేవ్‌ ‌సంక్షోభం దాటికి క్రమక్రమంగా దిగువకు రావడం, సెకండ్‌ ‌వేవ్‌లో ఇంకింత కు గురి కావడంతో ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మరమ్మత్తులో భాగంగా ఆర్థిక వేత్తలు, మార్కెట్‌ ‌నిపుణులు, బ్యాంకింగ్‌రంగ విశ్లేషకులు, వివిధ సలహాలు, అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, ఇందులో గత కొన్ని రోజులుగా ప్రధానంగా వినపడే పదం కొత్త కరెన్సీ ముద్రణ. కొత్త కరెన్సీ ముద్రణపై రెండు భిన్నాభిప్రాయాలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్థిక స్థితి మెరుగు పరుచుటకు క్రొత్త కరెన్సీ మార్కెట్లోకి పంపింగ్‌ ‌చేయాలని కొందరు, కొత్త కరెన్సీ రావడం వల్ల సప్లై డిమాండ్లమధ్య వ్యత్యాసం ఏర్పడి ఆర్థిక వ్యవస్థద్రవ్యోల్పణం వైపు నెట్టబడుతుందని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు అభిప్రాయాలను పూర్తిగా ఆహ్వానించలేము, అలా అని పూర్తిగా కొట్టి పారేయలేము.

ముందుగా, నూతన కరెన్సీ ఆవశ్యకతను పరిశీలిస్తే, కోవిడ్‌ ‌లాక్‌డౌన్ల వల్ల పరిశ్రమల ఉత్పాదకత తగ్గగా, భారీస్థాయిలో నిరుద్యోగం, ఆదాయ క్షీణతలు ఏర్పడటం, ప్రధానంగా మధ్య, దిగువ స్థాయి ప్రజల జీవన శైలి తీవ్ర ్రపతికూలతలగురి కావడంతో వినియోగం పూర్తిగా తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ కుడి మాండ్షాక్‌ ఏర్పడింది. ప్రజల కొనుగోలు శకి్త పెరగాలంటే ముందుగా వారి చేతిలో నగదు కావాల్సినంత ఉండేలా చేయడం ఒక్కటే మార్గం. అలాంటప్పుడు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంక్షోభంలో ఉన్న వేతన జీవులకు, చిరు వ్యాపారులకు, కూలీలకు కొంత నగదును ప్రత్యక్షంగా చేతికందిస్తే మళ్ళీ డిమాండ్‌ను పునరుద్ధరించవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా వడీ్డ లేని రుణాల ద్వారా కొందరికి, కొరోనా కాలానికి ( 2020-2021) మధ్య, దిగువ స్థాయి ప్రజలు కల్గి ఉన్న గృహ, వ్యాపార, విద్య రుణాలపై పాక్షికంగా అసలును, వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం, మాఫీ చేయబడిన మొత్తంను బ్యాంకులకు ఇవ్వడానికి ప్రభుత్వ నూతన కరెన్సీని ఉపయోగిస్తే, కొన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తి ని పెంచవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జనధనా ఖాతాలలో, కూడా నగదు సరఫర చేయవచ్చు.

నాణానికి ఇంకో వైపు చూసినట్లయితే, నూతన కరెన్సీని మార్కెట్లో కి అదనంగా పంపడం వల్ల ద్రవ్య సప్లై పెరిగి ప్రజల డిమాండ్‌ ఒక్కసారిగా పెరగ డం, వస్తుసే వల సపై్ల , డిమాం డ్‌కు సరిపోక పోవడం జరిగి ధరలు భారీగా పెరిగి ద్రవ్యోల్పణం సమస్య మొదల వుతుంది, ఇంకో వైపు నగదు లభ్యత పెరిగి వడ్డీ రేట్లు తగ్గడం జరుగుతుంది. ఫిక్సిడ్‌ ‌డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గే ఆస్కారం లేకపోలేదు. తద్వారా కరెన్సీ విలువ పడిపోయే ప్రమాదం ఉంటుంది. నగదు ముద్రణ అనేది మార్కెట్లో లిక్విడిటీ కొరత ఉన్నప్పుడు, ప్రభుత్వం వద్ద నిధుల సమీకరణ మార్గాలు లేనప్పుడు మాత్రమే చేపట్టడం శ్రేయస్కరం. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న వనరులను చూస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌ – ‌సెప్టెంబర్‌ ‌మధ్య 2.2 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తామని ఆర్బీఐ చెప్పడం, జీఎస్టీ వల్ల గత 8 నెలలుగా నెలకు ఒక లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుండడం, ఆర్బీఐ 99 వేల కోట్ల రూపాయలకు పైగా నగదును ఒక్కో ప్రత్యేక నిబంధన ప్రకారం ప్రభుత్వ ఖజానాకు బదిలీ కావడం, ప్రభుత్వ కంపెనీల్లో వాటాల, పెట్టుబడుల ఉపసంహరణ, కొన్ని పీఎస్యూలను ప్రైవేటీకరణ వల్ల కూడా ప్రభుత్వానికి డబ్బు రావడం, ఎల్‌ఐసీ, ఐపీఓ వల్ల దాదా పు లక్ష కోట్లు సేకరణ లాంటి మార్గాలు ప్రభుత్వం ముందు ఎలాగూ ఉన్నాయి. అంతేకాక, బాండ్‌ ‌మార్కెట్‌ ‌నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు సేకరించనున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. దాని వల్ల ప్రభుత్వ ఖజానాలోకి డబ్బును వస్తాయి. అయితే, ఇలా ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలను కుంటే, అంత సేకరించవచ్చు. అది కాకుండా ఆర్బీఐ దగ్గర బ్యాంకులు జమ చేసిన డబ్బు కూడా ఉంది. వ్యాపారులు, పరిశ్రమలరుణాలు ఇచ్చిన తర్వాత బ్యాంకులు మిగిలిన డబ్బును ఆర్బీఐ ఖాతాలో తిరిగి జమ చేస్తాయి. ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర 5 లక్షల కోట్లకు పైగా బ్యాంకుల డబ్బు ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో నూతన కరెన్సీ పెద్దగా ఉపయోగపడక పోవచ్చు. కాని, ప్రభుత్వం తన బ్యాలన్స్షీ ట్ను ప్రజల ఆర్థిక స్థితిని మెరుగు పర్చుటకు ఏ మేరకు సవరిస్తుందనేది ఇప్పుడు న్న ప్రశ్న. ఒక వేళ ఆర్థిక ఫలాలు ద్వితీయ శ్రేణిప్రజలకు చేరనప్పుడు, పరిస్థితులు మరింత దిగజారడం, ప్రజలు ముందు జాగ్రత్తగా డబ్బును ఖర్చు చేయడం ఆపేసి దాచుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అటువంటప్పుమార్కె్ల క్విడిటీ కొరతను ఎదుర్కొంటుంది అప్పుడు నూతన కరెన్సీ ఆవశ్యకత ఏర్పడుతుంది. అలా జరగకూడదు అంటే ప్రభుత్వాలు బడ్జెటే తర నిధులు ప్రజల సంక్షేమంకు ఖర్చు చేయాలి. అధికంగా కరెన్సీని ముద్రించడాన్ని టెక్నికల్‌ ‌భాషలో ‘క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌’ అం‌టారు. అంటే, స్థూలంగా కరెన్సీ లభ్యతను పెంచడమని అర్థం. ప్రపంచంలోని చాలాదేశాల్లో ఈ పద్ధతిని అవలంబించారు. అమెరికా ఫెడరల్‌ ‌రిజర్వ్ ఇటీవల దీనిని విజయవంతంగా అమలు చేసింది. కానీ వెనెజ్వెలా, జింబాబ్వే లాంటి దేశాల్లో ఈ చర్యల వల్ల చాలా ప్రమాదకరమైన పరిణామాలు తలెత్తాయి.

dr-md
డాక్టర్‌ ఎం‌డి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌అం‌డ్‌ ‌ఫైనాన్స్
9492791387

Leave a Reply