Take a fresh look at your lifestyle.

భద్రత కావాలి..?!

బందాలు మృగ్యమై
ఆత్మీయతలు శల్యమై
అనుబంధాలు శకలమై
అస్తిత్వాలు ప్రశ్నార్థకమై
బతుకు శూన్యమైన వేళ
మనిషి ‘‘అర్థం’’ మారింది

ఇప్పుడు మనిషంటే…
ఒంటరితనానికి సంకేతం
జీవశ్చవానికి సజీవ సాక్ష్యం
నిరాశ,నిస్పృహకు  నిదర్శనం
విషాద సంద్రానికి ప్రతిరూపం
మొత్తంగా చావు చిరునామా

ఇపుడు తనకు
ఒక ఊపిరి సిలిండర్‌ …
‌మరో జన్మ ఎత్తిన వరం

ఒక వ్యాక్సిన్‌ ..
‌యుద్ధం గెలిచిన గర్వం

ఒక పడక
బతుకు భరోసా తేజం

ఒక అంబులెన్స్
‌మంచు పల్లకి చందం

ఒక స్పర్శ …
సంజీవని సమానం

ఒక ఆలింగనం…
మధుర అలంబనం

ఒక పలకరింపు…
వెయ్యి ఏనుగుల బలం

ఇపుడు మనిషికి
ఆస్తి అస్తిపస్తులు
పేరు ప్రతిష్టలు అక్కర్లేదు
ఊపిరిలకు ఆక్సిజను
మనసు కింత ఓదార్పు
దేహానికి కాస్తంత భద్రత
బతుకు ఉద్దీపనం కావాలి

– కోడిగూటి తిరుపతి :9573929493

Leave a Reply