Take a fresh look at your lifestyle.

చక్కటి నిద్రను ఆహ్వానించాలి

టీనేజ్‌ ‌పిల్లలకు 8-10 గంటల నిద్ర అవసరం

జీవితంలో ఎన్నో రకా లైన బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తి డిలకు గురవుతుంటాము. ఒత్తిడిలను ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా సహజ సిద్ధంగా లభించే చక్కటి ఆరోగ్య పరిస్థితిని కోల్పోయి రోజుల కొలదీ ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతుంటాము. మనిషికి కమ్మని నిద్ర చాలా అవసరం. నిద్ర కరువైతే శరీరం అనేక రోగాలకు దారితీస్తుంది. నిద్ర శారీరిక, మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకమైనది. నిద్రను నిర్లక్ష్యం చేసి మనుషులు అనారోగ్యాల పాలు కాకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. నిద్రలేమి అనేది ప్రపంచ వ్యాప్తంగా మనుషులను పీడిస్తున్న ప్రధానమైన సమస్య. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా నిద్ర లేమి సమస్య పట్టి పీడిస్తోంది. ఎన్నో సౌకర్యాలతో పాటుగా ఆస్తులు, అంతస్తులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా 45 శాతం మంది నిద్రాదేవి ఆదరణను నోచుకోవడం లేదని సర్వేలు తెలియచేస్తూ ఉన్నాయి. సకల మనోరుగ్మతలకూ, శారీరక రుగ్మతలకూ సుఖ నిద్రయే మందు. నిద్రను ఆహ్వానించి, ఆస్వాదించినప్పుడే ఆనందంగానూ, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.

పరీక్షల సమయంలో నిద్ర ప్రభావం

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని పిల్లలు అందరూ పరీక్షలను రాసే సమయమిది. నిద్ర పోకుండా తీవ్రంగా కష్టపడటం కంటే మంచి నిద్ర తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. నిద్రకు ఖచ్చితంగా 6 గంటల పాటు సమయాన్ని కెటాయించాలి. సరైన నిద్ర తీసుకొన్నప్పుడే బ్రెయిన్‌ ఆక్టివ్‌గా పని చేయడానికి అవకాశం ఉంటుంది. పరీక్షల సమయంలో పిల్లలు తిండి తినడంలో సరైన ఆసక్తి చూపించకపోవచ్చు. పిల్లలు నిర్ణీతసమయంలో ఆహారాన్ని తీసుకోవడంలో తల్లిదండ్రులుగా సరైన బాధ్యతను పోషించాలి. కదుపులో ఆకలిగా ఉన్నప్పుడు చదువుపై ఏకాగ్రత రావాలంటే చాలా కష్టం. మెదడు చురుగ్గా పనిచేయాలంటే పిల్లలు సరైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. చదివే పిల్లల్లకు సైరైన నిద్ర ఆహారం తప్పని సరి.

ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర

ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర మూల స్తంభం వంటిది. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్రకూడా అంతే ముఖ్యం. నిద్రావస్థలోనే శరీరం రిలాక్స్ ‌పొంది ఆ రోజులో జరిగిన చిన్నచిన్న ఇబ్బందులను తొలగించుకుంటుంది. సంపూర్ణ నిద్రలోనే మెదడు పదునెక్కుతుంది. మెదడు సక్రమంగా పనిచేయడంలో నిద్రయే కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు సరిగా పనిచేస్తే మంచి ఏకాగ్రత లభిస్తుంది. తద్వారా తెలివిగా పనిచేయడంలో మెదడు సహకరిస్తుంది. మంచి జ్ఞాపక శక్తిని పెంచేందుకు కూడా నిద్ర ఉపయోగపడుతుంది.

సుఖ నిద్రకు ఎంత సమయం

వయసును బట్టి నిద్ర పోయే వేళలు మారినప్పటికీ కనీసం సగటున ప్రతిరోజూ ఏడు గంటలైనా నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల శరీర బరువు పెరుగుతందనేది అక్షర సత్యం. మెదడు పని తనం సన్నగిల్లుతుంది. సగటు ఆయుర్దాయం తగ్గుతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర పోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. సెలవు రోజు అంటూ నిద్రకు ఎలాంటి మినహాయింపు లేదు. ప్రతి రోజు వ్యాయామం చేసినట్లయితే సుఖ నిద్ర శరీరం కోరుకుంటుంది. పుట్టిన పిల్లలకు 18 గంటలు నిద్ర, చిన్న పిల్లలకు 11 గంటలు నిద్ర, టీనేజిలో ఉండే వారికి 8-10 గంటలు నిద్ర సుఖమయమైన నిద్ర.

పడకగదిలో కూడా ఫోన్‌లే

మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో సరిపడా నిద్ర కూడా అంతే అవసరం. మనిషిలో కలిగే భావోద్వేగాలను నియంత్రణ చేయాలంటే మంచి నిద్ర అవసరం. మనిషి సుఖ నిద్ర వల్ల తనలో కలిగే ఆవేశాలను తన కంట్రోల్‌ ‌లో ఉంచుకోగలగుతాడు. ఇతరులతో చక్కటి మానవ సంబంధాలు కొనసాగించేందుకు కూడా నిద్ర తోడ్పడుతుంది. నిద్రలేమి సమస్య యువతలో కూడా ఎక్కువగా ఉంటోంది. యువత రాత్రిపూట 8- 10 గంటలపాటు నిద్రపోవాలి. ఒకప్పుడు బెడ్రూమ్‌ అం‌టే విశ్రాంతికి చిహ్నంగా ఉండేది. ప్రస్తుతం పడక గదిలో కూడా ల్యాప్టాప్లు, స్మార్ట్ ‌ఫోన్లు అత్యధికంగా ఉపయోగిస్తున్నరని అనడంలో అతిశయోక్తి లేదేమో. స్మార్ట్ ‌ఫోన్లకు బానిసలుగా మారి నిద్రను తగ్గిస్తూ మానసిక రుగ్మతలు పెంచుకుంటున్నారు. నిద్రలేమి కారణంగానే మనిషిలో మానసిక ఒత్తిడిలు కలుగుతాయి. ఒత్తిడితో బాధపడే రోగులు తగినంత నిద్రపోని వారే ఉంటారని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయి. చాలినంత నిద్ర పోకుంటే ఒత్తిడి, కృంగుబాటు వంటి మానసిక సమస్యలు వస్తాయి.

చక్కని నిద్రకు చిట్కాలు

నిద్ర పోయే సమయాని కంటే అరగంట ముందుగానే ఎలక్ట్రానిక్‌/‌సమాచార ఉపకరణాలకు(టీవీ, కంప్యూటర్‌, ‌టాబ్‌, ‌మొబైల్‌) ‌ముఖ్యముగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్‌ ‌ఫోన్లు స్విచాఫ్‌ ‌చేయాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయ సన్నిహితులతో గడపాలి. ప్రతీ రోజూ ఒకే వేళకి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి పూట తీసుకునే ఆహారం నిద్రా సమయం కంటే రెండుగంటల ముందుగా తీసుకోవాలి. మనం పడుకొనే సమయం వరకు ఆహారం సగం జీర్ణం కావాలి.

నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కానే కాదు

నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కాదని, ఆలోచనా విధానంలో మార్పుతోనే పరిష్కారం సాధ్యం. సహజ సిద్ధంగా లభించే నిద్రను ఆస్వాధించండి. చక్కటి ఆరోగ్యంతో జీవించండి. నిద్రలేమి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే దగ్గరలోని సైకాలజిస్ట్ ‌ద్వారా కాగ్నిటివ్‌ ‌బిహేవియరల్‌ ‌థెరఫీ(సిబిటి) చికిత్స ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు.

image.png

డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి

రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply