Take a fresh look at your lifestyle.

బిజెపోళ్లు పంచే మందు సీసాలు కావాలా? కాళేశ్వరం నీళ్లు కావాలా?

  • దొంగరాత్రి కరెంటు కాంగ్రెస్‌కు మళ్లీ వోటేద్దామా?
  • చేగుంట రైతు మద్దతు సభలో మంత్రి హరీష్‌రావు

దుబ్బాక ఉప ఎన్నికల్లో వోట్ల కోసం బిజెపి నేతలు మందు సీసాలు ఇష్టారీతిగా పంచుతున్నారనీ…బిజెపోళ్లు పంచే మద్యం సీసాలు కావాలా? టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కోరారు. బుధవారం దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డికి మద్దతుగా జరిగిన రైతుల సభను ఉద్దేశించి మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..కాలిపోయే మోటార్లు కావాలా? బావి దగ్గర మీటర్లు కావాలా? వ్యవసాయానికి నాణ్యమైన ఉచితంగా 24 గంటలు కరెంట్‌ ‌కావాలా? ప్రజలే నిర్ణయించుకుని ఈ ఉప ఎన్నికల్లో వోటు వేయాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో నీరు తెచ్చి రెండు పంటలుపండేలా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం చేస్తుందన్నారు. అందరూ అసాధ్యం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును సుసాధ్యం చేసిన ఘనత సిఎం కేసీఆర్‌దేననీ అన్నారు.   కేంద్రం తీసుకువచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా త్వరలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply