Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ అవసరమేనా? ఆర్థిక వ్యవస్థ డబుల్‌ ‌డిప్‌కు గురౌతుందా?

కోవిడ్‌ ‌గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారతావనిని మళ్ళి గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న కోవిడ్‌ 19 ‌కేసులు ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. సరిగ్గా సంవత్సరం క్రిందట, ఇదే సమయంలో మొదలైన కోవిడ్‌ ‌ప్రస్థానం చివరిదశకు చేరుకుంటుంది అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ మొదలగు రాష్ట్రాల్లో కేసులు పెరగడం కలవరపెడుతోంది. అయితే, తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, ‌ఛత్తీస్గఢ్‌, ‌పంజాబ్‌ ‌రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్‌ ‌కేసులు గత కొన్ని రోజులుగా పెరుగడం ప్రజల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో కరోనా వైరస్‌ ‌భయం కంటే లాక్‌ ‌డౌన్‌ ‌భయమే అధికంగా ఉందని చెప్పవచ్చు.

మళ్ళి లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తే ఇప్పుడు కోలుకోవడం దాదాపు అసాధ్యమే అన్న భాద అన్ని వర్గాల మదిలో మెదులుతుంది. అయితే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో లాక్‌ ‌డౌన్‌ ‌విధించబోతున్నారన్న వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఏ ప్రాంతమైన లాక్‌ ‌డౌన్‌ ‌విధించడం సరైన వ్యూహం కాదనే చెప్పాలి. ఎందుకంటే, గత సంవత్సరంలో లాక్‌ ‌డౌన్‌ ‌విధించే సమయానికి దేశంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కరోనా వచ్చిన మొదటి దశలో దేశంలో ప్రజలకు అవగాహన లేకపోవడం, ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు తగినంతగా లేకపోవడం, వైరస్‌ ‌ను గుర్తించడం లో ఆలస్యం, వాక్సిన్‌ ‌లేకపోవడం, లాంటి సమస్యలు ఉండేవి. కావున ప్రభుత్వాలు నియంత్రణ చర్యలో భాగంగా లాక్‌ ‌డౌన్‌ ‌తప్పనిసరి అయ్యింది. కానీ ఇప్పుడు ప్రజల్లో పూర్తి అవగాహన ఉండటమే కాక మాస్క్ ‌లు ధరించడం, లక్షణాలు కనిపిస్తే టెస్ట్ ‌లూ చేయించుకోవడం జరుగుతుంది. ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు, తగినన్ని ల్యాబ్స్, ‌కోవిడ్‌ ‌వాక్సిన్‌ ‌కూడా అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో మళ్ళి లాక్‌ ‌డౌన్‌ ‌విఫల ప్రయోగమే అవుతుంది.

ఒకవేళ లాక్‌ ‌డౌన్‌ ‌విధిస్తే, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యాపార, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు మళ్ళీ స్తంభించడమే కాక ‘‘వి ‘‘ ఆకార మాంద్యం నుంచి ‘‘డబ్ల్యూ’’ ఆకార మాంద్యం కు దారి తీస్తుంది. ‘‘డబ్ల్యూ ‘‘ఆకార మాంద్యం ను ‘‘డబల్‌ ‌డిప్‌’’ ‌మాంద్యమం అని కూడా అంటారు. ఎందుకంటే, ఇందులో ఆర్థిక వ్యవస్థ రెండుసార్లు పతనమై మళ్ళి పూర్తి స్థాయి రికవరీ సాధిస్తుంది. అయితే, మొదటిసారి, పతనమై వేగంగా రికవరీ సాధించినప్పుడు, పెట్టుబడిదారులు , వ్యాపారసంస్ధలు పాండెమిక్‌ ‌వెళ్లిపోయిందనుకొని మార్కెట్‌ ‌లో తమ కార్యకలాపాలను విస్తరించడం జరుగుతుంది. కాని, పాండమిక్‌ ‌మళ్ళి విస్తరించడంతో మొదటి రికవరీ అంతే వేగంగా పతనం అవడంతో ఆర్థిక మాంద్యం లో కి వెళ్లడం జరుగుతుంది. 1980 లో యూ.ఎస్‌ ‌లో ఏర్పడిన మాంద్యం ‘‘డబ్ల్యూ’’ మాంద్యమం కు ఉదాహరణగ చెప్పవచ్చు.

ఈ మాంద్యమం 1982 వరకు ఉంది. జనవరి నెలలో వెలువరించిన నివేదికలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 11.5% వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అం‌చనా వేసింది. మరియు వచ్చే ఏడాది రెండంకెలలో వృద్ధి చెందుతున్న ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ భారత్గా ఉంటుందని, ఎఫ్‌.‌వై 23 లో అత్యధికంగా 6.8 శాతం పెరుగుదలను సాధించవచ్చని తెలిపిన విషయం తెలిసిందే. ఈ గణాంకాలు నిజమవ్వాలంటే వ్యాపార కార్యకలాపాలు స్తంభించకుండా, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు పెరుగడం, క్రొత్త స్ట్రెయిన్‌ ‌రావడంతో ఆర్థికవ్యవస్థ ఇంకో డిప్‌ ‌తీసుకునే ఆస్కారం లేకపోలేదని, రికవరీ వి-ఆకారానికి బదులుగా డబ్ల్యు-ఆకారంలో ఉండబోవచ్చు. అయితే కోవిడ్‌ ‌పాండమిక్‌ ‌కాస్త విస్తరిస్తున్న తరుణంలో ఆందోళనకరమైన ప్రాంతాలలో టెస్టులు, వాక్సిన్‌ ‌పంపిణి ప్రక్రియ వేగవంతం చేయడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని లక్షణాలను బట్టి క్వారంటైన్‌ ‌కు తరలించడం, వినోద మరియు ఇతర వేడుకల కార్య క్రమాలపై కొన్ని పరిమితులు విధించడం, పాఠశాల స్థాయిలో ఉన్న తరగతుల నిర్వ హణను వైద్య సిబ్బంది ద్వారా నిరంతర పర్యవేక్షణను చేపట్టడం లాంటివి అమలు చేస్తే కరోనా రెండో దశను జయించవచ్చు.

md khaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply