Take a fresh look at your lifestyle.

జూలై 26న నీట్‌ ‌జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్

పరీక్షల తేదీలను ప్రకటించిన కేంద్రమంత్రి
లాక్‌డౌన్‌ ‌కారణంగా వాయిదాపడ్డ ఐఐటీ, జేఈఈ, నీట్‌ ‌పరీక్షా తేదీల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ ‌పోఖ్రియాల్‌ ‌మంగళవారం పరీక్షా తేదీలను వెల్లడించారు. జులై 18-23 వరకు జేఈఈ మెయిన్స్, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ‌పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక జులై 26న నీట్‌ ‌పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కారణంగా వివిధ పరీక్షా తేదీలు ఇప్పటివరకు వాయిదాపడ్డాయి. అయితే పెండింగ్‌లో ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవల సీబీఎస్‌ఈ ‌ప్రకటించగా, 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇదే అంశానికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని రమేష్‌ ‌పోఖ్రియాల్‌ అన్నారు.

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎం‌ట్రన్స్ ‌టెస్ట్ (‌నీట్‌) ‌పరీక్ష 15 లక్షల మంది, జేఈఈ మెయిన్స్ ‌రాసేందుకు 9 లక్షల మంది రిజిస్టర్‌ ‌చేసుకున్నారని వెల్లడించారు. ఐఐటీ-జేఈఈ మెయిన్‌ ‌పరీక్షలు జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక నీట్‌ ‌పరీక్షను జూలై 26న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ‌పరీక్షల తేదీలను మాత్రం కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఆగస్టులో జేఈఈ అడ్వాన్సుడ్‌ ‌పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని కేంద్రమంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply