Take a fresh look at your lifestyle.

లక్షకు దగ్గరలో కొత్త కేసులు..61 రోజుల అత్యల్పం

దేశ వ్యాప్తంగా తగ్గుతున్న కొరోనా
11వ రోజు 2 లక్షల లోపు కేసులు
25వ రోజూ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువ
కొత్తగా 2,427 మంది మృత్యువాత
23.27 కోట్ల టీకా డోసుల పంపిణీ
ఏడు రాష్ట్రాల్లో వేయికన్న తక్కువ కేసులు : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌
‌దేశంలో గత 24 గంటలలో 1,00,636 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలకాలంలో ఇది అత్యల్పం. వరుసగా 11 రోజులుగా దేశంలో రోజూ 2 లక్షలలోపు కేసులు నమోదవుతూ వొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమన్వయంతో ఉమ్మడిగా చేస్తున్న కృషి ఫలితంగా కనిపిస్తున్నది. చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా తగ్గుతూ వొస్తున్నది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య రెండు రోజులుగా 15 లక్షలకు లోపే ఉంటూ ఉండగా నేడు 14,01,609 గా నమోదైంది. 7 రోజులుగా 20 లక్షలలోపు నమోదైంది. గత 24 గంటలలో నికరంగా 76,190 కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ ‌కేసులలో వీరి వాటా 4.85% మాత్రమే. ఎక్కువ మంది కోలుకుంటూ ఉండటంతో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే అధికంగా ఉండడం 25 రోజులుగా సాగుతున్నది.

గత 24 గంటలలో 1,74,399 మంది కోవిడ్‌ ‌బారినుంచి బైటపడ్డారు. శనివారం కంటే ఆదివారం కోలుకున్నవారు 73,763 మంది ఎక్కువ. ఇప్పటి వరకు కోవిడ్‌ ‌బారిన పడి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 2,71,59,180 కాగా కోలుకున్నవారి శాతం 93.94%. గత 24 గంటలలో 15,87,589 కోవిడ్‌ ‌నిర్థారణ పరీక్షలు జరపగా మొత్తం పరీక్షల సంఖ్య 36,63,34,111 కు చేరాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కోవిడ్‌ ‌పరీక్షల సంఖ్య పెంచగా మరోవైపు పాజిటివిటీ శాతం బాగా తగ్గుతూ వొస్తున్నది. రోజువారీ పాజిటివిటీ ప్రస్తుతం 6.34% కు చేరగా వరుసగా 14 రోజులుగా అది 10% లోపే ఉంటున్నది. ఇప్పటిదాకా 23.27 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది. సోమవారం ఉదయం 7 గంతలకు అందిన నివేదిక ప్రకారం 32,68,969 శిబిరాల ద్వారా 23,27,86,482 టీకా డోసుల పంపిణీ జరిగింది.

ఏడు రాష్ట్రాల్లో వేయికన్న తక్కువ కేసులు : కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌
‌ఢిల్లీ, హర్యానాతో సహా 7 రాష్ట్రాల్లో 1,000 కంటే తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ‌తెలిపారు. దేశంలోని కోవిడ్‌ ‌పరిస్థితులపై సోమవారం వి•డియాతో మాట్లాడారు హర్షవర్ధన్‌. ‌దేశంలో ప్రస్తుతం 14,01,609 కరోనా యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయని, కరోనా రికవరీ రేటు నిలకడగా పెరుగుతోందని చెప్పారు. 10 రాష్టాల్లో్ర 83 శాతం యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయని, మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 17 శాతం యాక్టివ్‌ ‌కేసులు ఉన్నట్లు వివరించారు. మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, ‌ఝార్ఖాండ్‌ ‌రాష్టాల్రు వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదవుతున్న జాబితాలో ఉన్నాయని హర్షవర్ధన్‌ ‌తెలిపారు.

ఇక జమ్మూకశ్మీర్‌, ‌పంజాబ్‌, ‌బీహార్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌లో 2,000 కంటే తక్కువగానే కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర కేరళల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపుపై దృష్టిపెట్టాయి. తాజాగా ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం కర్ఫ్యూలో సడలింపులు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించింది. ఈ సడలింపు జూన్‌ 10 ‌నుంచి అమల్లోకి రానుంది. ఇక తెలంగాణలో కూడా లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపులు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. మంగళవారం జరిగనున్న కేబినేట్‌ ‌భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

Leave a Reply