Take a fresh look at your lifestyle.

నచ్చితే నజరానా.. నచ్చకపోతే జుర్మానా..!

  • దేవరయాంజాల్ దేవాలయ భూముల పేరుతో రాజకీయ కక్ష..
  • 437 సర్వేలో మంత్రి కేటీఆర్, కేసీఆర్ సన్నిహితుల కు భూములు.
  • సీబీఐ విచారణ కు ఎం పీ రేవంత్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్ ,మే 3; దేవరయాంజాల్ సీతారామస్వామి ఆలయ భూముల్లో కేసీఆర్ కుటుంబం ,ఆయన సన్నిహితుల భూములున్నాయని, నిషేదిత జాబితాలో ఉన్న 437 సర్వేలో మంత్రి కేటీఆర్, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు కు భూములున్నాయని ఎం పీ రేవంత్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ..”సేల్ డీడ్ కాపీలను బయటపెడుతున్నా..నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ అక్కడే ఉంది..మంత్రి మల్లారెడ్డి సర్వే నెం. 658 లో 7 ఎకరాలను ఆక్రమించి ఫార్మ్ హౌస్ కట్టుకున్నారు..

అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూలగొట్టాలి అని డిమాండ్ చేశారు.’ టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులకు అక్కడ భూములున్నాయి..2015 లో కేటీఆర్ 11 లక్షలకు ఎకరం చొప్పున కొన్నారు..కోట్ల విలువ భూములను అంత తక్కువ కు ఏలా కొన్నారు అని ప్రశ్నించారు. ‘అన్ లైన్ లో దేవరాయాంజాల్ భూముల ఎందుకు మాయం అయ్యాయి..1531 ఎకరాల భూముల సర్వే నెంబర్ల వారిగా దేవదాయ శాఖ భూముల వివరాలను ధరణిలో ఎందుకు హైడ్ చేసాడు..9 జిల్లాల వివరాలు ఉంచి..రంగారెడ్డి జిల్లా దేవాదాయ భూములు ఎందుకు అన్ లైన్లో దాచారు..తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెవిన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

95 సంవత్సరాలకు దేవరయాంజాల్ దేవాలయ భూముల వివరాలను బయట పెట్టాలి..స్థానిక ఎంపీగా నేను అడిగినా రికార్డులు, జరిగిన లావాదేవిల చిట్టాను ఇవ్వడం లేదు అని ఆరోపించారు.’మీ బండారం బయటపడుతదనే ప్రజలకు చెప్పడం లేదు..నచ్చితే నజరానా..నచ్చకపోతే జుర్మానా..దేవరయాంజాల్ దేవాలయ భూముల పేరుతో రాజకీయ కక్షకు దిగుతున్నారు..ఈటలను తొలగించిన విధంగానే కబ్జా మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలను శాఖల నుంచి తప్పించాలి..అధికార దుర్వినియోగానికి దిగే ప్రమాదం ఉంది..అందుకే తక్షణం తొలగించాలి..ప్రభుత్వానికి సంబంధం లేని దేవదాయ భూములను తనఖా పెట్టి నమస్తే తెలంగాణ వందల కోట్ల రుణాలు తెచ్చుకుంది..రాష్ట్ర విచారణలో నిజాయితీ లేదు..అనుకూలంగా చేసుకుంటున్నారు..బ్యాంకులను తప్పు దారి పట్టించారు..అందుకే సీబీఐ విచారణ జరపాలి..కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేస్తా,సహయ మంత్రి కిషన్ రెడ్డి కి ఫిర్యాదు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply