Take a fresh look at your lifestyle.

వడ్డీ వ్యాపారులపై నజర్‌ : ఎస్పి

చిరు వ్యాపారులు, ప్రజలు తమ కు ఆర్థికంగా ఎదురుదెబ్బ తగిలిన సమ యంలో వారికి తప్పక డబ్బులు అవసర మైన క్రమంలో అప్పు తీసుకుంటారని, ఇదే అదునుగా అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ‌కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు వడ్డీ వ్యాపారులపై, చిట్టీల వ్యాపారులపై, రోజువారీ కలెక్షన్‌ ‌నిర్వహించే వ్యాపారులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. వ్యాపారులు వడ్డీ పేరిట వారిని ఇబ్బందులకు గురిచేయవొద్దని, ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

అధిక వడ్డీలు వసూలు చేసే వారి యొక్క వివరాలను సేకరిస్తున్నామని, ఇలాంటి వారిపై ముందస్తుగా బైండోవర్‌ ‌చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. వడ్డీల పేరిట వేధింపులకు గురిచేస్తే స్థానిక పోలీసు వారికి లేదా డయల్‌ 100‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Leave a Reply