వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బిజెపిని విమర్శించిన వారిపై .. నక్సలైట్‌ ‌ముద్ర: కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ

January 26, 2020

 Naxalite seal On those who criticize BJP ..
ట్విట్టర్‌లో మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ

న్యూఢీల్లీ: బీజేపీ అసమర్థ పాలనను, ద్వేషపూరిత ఎజెండాను విమర్శించినవారిపై అర్బన్‌ ‌నక్సలైట్‌ అనే ముద్రవేస్తున్నారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. ట్విటర్‌ ‌వేదికగా ఆయన బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. భీమా- కోరెగావ్‌ ‌కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసందే. ప్రతిఘటనకు చిహ్నమైన భీమా- కోరెగావ్‌ ‌యుద్ధ స్మారకం ప్రాముఖ్యాన్ని కేంద్రానికి తొత్తుగా పనిచేసే ఎన్‌ఐఏ ‌తగ్గించలేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. కేసుపై మహారాష్ట్ర ప్రభుత్వం పుణె సీనియర్‌ ‌పోలీసు అధికారులతో సక్షాసమావేశం నిర్వహించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం నిర్ణయంపై ఉద్ధవ్‌ ‌ఠాక్రే ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా శివసేన ప్రభుత్వం భీమా- కోరెగావ్‌ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్తలు, మేధావులపై కేసును ఉపసంహరించుకుంటున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర మంత్రి అనిల్‌ ‌దేశ్ముఖ్‌ ‌స్పందించారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

Tags: Naxalite seal, those who, criticize BJP Setting, hatred agenda,Koregaon riots