Take a fresh look at your lifestyle.

తెలంగాణ లో నక్సలిజం తగ్గుముఖం..: సీ ఎమ్ కేసీఆర్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతఈత్వంలో ఢిల్లీలోని విజ్ఒన్ భవన్ లో జరిగిన ఎలడబ్ల్యూఈ ఎఫెక్టెడ్ రాష్ట్రాల మీటింగ్ లో, తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజం తగ్గుముఖం పట్టిందని సిఎం కేసీఆర్ తెలిపారు.క్షేత్ర స్థాయిలో యాక్టీవ్ గా ఉండే, సెకండ్ క్యాడర్ లో వుండే చాలా మంది నక్సలైట్లు తెలంగాణ లో జన స్రవంతిలో కలుస్తున్నారని వివరించారు. గడిచిన ఏడాది కాలంలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసులు ముందు లొంగిపోయారని చెప్పినట్లు సమాచారం. ఆరు నెలల్లో 20 మంది లొంగిపోయారని, వీరికి తోడు తాజా మరో 10 మందికి పైగా పార్టీని వీడారని వివరించినట్లు తెలిసింది. ఇటీవల లొంగిపోయిన కేంద్ర కమిటీలో సభ్యురాలైన శారదక్క తో పాటూ, పలువురు పేర్లతో కూడిన నివేదికను సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరికొంత మంది కీలక నేతలు త్వరలో లొంగిపోనున్నట్లు సమాచారం ఉందని వివరించారు.

ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో దాదాపు 105 మందికి పైగా ఉంటే, అందులో తెలంగాణ నుంచి 10 మందికి పైగా, ఏపి నుంచి 3 ముగ్గురు ఉన్నారని సమాచారం ఉన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో 50 మంది వరకు మావోయిస్ట్ లు ఉన్నారని, 90 మంది చత్తీస్ ఘడ్ కు చెందిన గుత్తి కోయలు ఉన్నట్లు యాంటీ నక్సల్ టీం దగ్గర సమాచారం ఉందన్నారు. అయితే, తెలంగాణ లో నక్సలైట్ల ప్రభావం లేదని, చత్తీస్ ఘడ్, ఒడిసా, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఏపి బార్డర్, వాళ్ల కదలికలు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. వీరు తెలంగాణలోకి ప్రవేశించకుండా నిరంతరం ఫోకస్ పెట్టడంతో పాటూ, ప్రివెంటీవ్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే, వారు నమ్మిన సిద్ధాంతాలు ప్రస్తుతం లేవన్న ఆలోచన నక్సలైట్ల లో బలంగా ఉందని, దీనికి తోడు ఆరోగ్య పరిస్థితులు వారిని వెంటాడుతున్నాయని గుర్తు చేశారు.

కరోనా తర్వాత ఈ సమస్యలు మరింత పెరిగాయని మీటింగ్ లో చెప్పినట్లు తెలిసింది. అలాగే, నక్సలైట్లను జన జీవన స్రవంతిలోకి ఆహ్వానించే దిశలో పునరావాస సదుపాయాలు, కొత్త వారు నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ దిశలో ప్రభుత్వం విద్యా, వైద్యం, ఇతర అభివఈద్ది దిశలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు నక్సల్ ఏరివేత విషయంలో కేంద్రం వంద శాతం నిధుల్ని ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఫోర్ జి కనెక్టివిటీ వేగవంతం, ఆదివాసీ – గిరిజన ఏరియాలో ఏకలవ్య స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, పారెస్ట్ ఏరియాలో రోడ్ల అభివఈద్ధిక పర్మిషన్ వంటి అంశాలను సమావేశంలో లేవనెత్తినట్లు తెలిసింది. అలాగే, అదనపు ఫోర్స్ కోసం బెటాలియన్లు కోరినట్లు సమాచారం. ఈ మీటింగ్ లో సిఎం వెంట సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు.

Leave a Reply