Take a fresh look at your lifestyle.

నవ తరం

రక్తం మరిగే యువత చేతిలో

సెల్లు ఫోన్‌ ‌చేరింది

గురువుల ముఖతః పాఠం బదులుగ

ఆన్‌ ‌లైన్‌ ‌మొదలైంది

 

విషయం నేర్పే పత్రిక మారి

ఫేస్‌ ‌బుక్‌ ‌వచ్చింది

అభిప్రాయ వేదిక రూపం

లైక్‌ ‌షేరులయ్యింది

 

మాటలు నేర్పే స్నేహం పోయి

ఇన్స్టాగ్రామ్‌ ‌కుదిరింది

నా స్టేటస్‌ ‌నా డాన్స్ అం‌టూ

వేదిక నిండిపోయింది

 

చిలకలాంటి పలుకులతోటి

ట్విట్టరు ఎగిరొచ్చింది

నా భావం నా స్వేచ్ఛ అంటూ

సొంత డబ్బా మ్రోగింది

 

అందరినీ కలిపేటందుకు

వాట్సప్‌ ‌గ్రూపు ఏర్పాటైంది

మిత్రులెవరో శత్రువులెవరో

తెలియకుండ పోయింది

 

ఇదే జీవితం అంటూ యువత

ముందుకే అడుగేస్తోంది

నవ జీవన గీతాన్నిపుడు

టెక్నాలజీ వ్రాస్తోంది

 

– నవడూరి దార సత్య వెంకట నాగేశ్వరరావు, చెన్నై

9987542133

Leave a Reply