Take a fresh look at your lifestyle.

నవధాన్య సాగే నరధాత్రికి రక్ష

కోవిడ్‌ ‌మహమ్మారి సృష్టించిన ప్రళయం నుండి ప్రపంచం నెమ్మదిగా కొలుకుంటున్నది.జీవ సాంకేతిక శాస్త్రవేత్తల నిర్విరామ కృషితో వైరస్‌ ‌జినోము క్రమాన్ని కనుగొని ఆ వెలుగులో వాక్సిన్‌ ‌రూపొందించారు. అమెరికా,ఇంగ్లండ్‌,‌రష్యా, చైనా లతో పాటు భారత్‌ అం‌టి కరోనా వాక్సిన్‌ ఉత్పత్తి దేశాల జాబితాలో చేరింది.పూణే కి చెందిన సీరం సంస్థ,ఆక్స్ ‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం,మరియు అస్ట్రా జెనికా లతో కలిసి కోవిషల్డ్ ‌టికాను,.అలాగే హైదరాబాద్‌ ‌లోని భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ జాతీయ వైద్య పరిశోధన సంస్థ,జాతీయ వైరస్‌ అధ్యయన సంస్థలతో కలిసి కోవాక్సిన్‌ ‌టీకాను రూపొందించాయి.

ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి తీవ్రత ఒకే రకంగా లేదు.అనేక అధ్యయనాలలో ఆయా దేశాల ఆహార అలవాట్లు ,కరోనా వ్యాప్తి,నిరోధకతల పై ప్రభావం చూపించాయని తెలియచేసాయి. ప్రకృతి సహజసిద్ధంగా అందించిన వైవిధ్య ఆహారాన్ని స్వీకరించిన ప్రాంతాల ప్రజలు ఎక్కువ నిరోధకతను ప్రదర్శించారు.పారిశ్రామిక విధానాల ద్వారా ప్రాసెస్‌ అయిన,అలాగే డోమెస్టికేషన్‌ ‌పద్ధతిలో పెంచిన జంతు సంబంధ ఆహార అలవాట్లు ఉన్న ప్రజలలో నిరోధకత తక్కువగా ఉండి కోవిడ్‌ ‌ప్రభావానికి ఎక్కువ లోనయ్యారు. అంతేకాదు ఈ ఆహార అలవాట్లు పర్యావరణ విధ్వంసానికి దారితీస్తున్నది.

ఈ అధ్యయనం ఫలితాలతో మరొక్క సారి జీవ వైవిధ్యం ను గౌరవిస్తూ కొనసాగే పంటల సాగుకు ప్రాధాన్యత ఏర్పడింది..స్థానిక రకాల ముడి ధాన్యాలను పండించి వినియోగించే ఆఫ్రికా,కొన్ని ఆసియా దేశాలలో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నది. సహజ పంటల ఆహార సంస్కృతి ని పునరుద్ధరణ అవశ్యకంగా మారింది. శతాబ్దాలుగా భారత్‌ ‌లో ఉన్న వైవిధ్య శీతోష్ణస్ధితుల లో వైవిధ్య ఆహార పంటల సాగు కొనసాగింది.1960 లో హరిత విప్లవం కారణంగా విచక్షణారహితంగా రసాయన ఎరువుల, క్రిమి నాశాకాల వినియోగం జరిగి కేవలము వరి, గోధుమ వంటి పంటలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాచీన భారత ఆహార సంస్కృతిలో భాగమైన సప్త వర్ణాల చిరు ధాన్యాలు,పప్పులు,నూనె గింజలు,కూరగాయాలు వంటి పంటలు క్రమేపీ అదృశ్యం అవుతున్నాయి1905 లో భారత్‌ ‌లో పర్యటించిన వృక్షశాస్త్రవేత్త అలబెర్ట్ ‌హోవార్డ్ ‌భారతీయ రైతులు వైవిధ్య సాగులో ప్రపంచానికి మార్గదర్శుకులు అని తన పుస్తకం లో ప్రస్తావించాడు.

ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ ప్రజలు తినే ఆహారంలో 70% సన్నకారు రైతులు తమ ఆధీనంలో 25% భూమిలో పండించినది అని తెలియచేసింది..గత నాలుగు దశాబ్దాల నుండి .ఒకటి రెండు పంటల మోనోకల్చర్‌ ‌తోపాటు అగౌరవ,అమానుష పద్ధతులలో జన్యుక్రమాన్ని మార్చిన మొక్కల,జంతువుల ఆహారం వాడుకలోకి వచ్చింది.అంతేకాకుండా వీటి నుండి ప్రాసెసింగ్‌ ‌చేయబడిన జంక్‌ ‌ఫుడ్‌ ‌ప్రాచుర్యంలోకి వచ్చింది.ఇవి శిలాజ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగిస్తాయి.పారిశ్రామిక విధానంలో ఒక యూనిట్‌ ఆహారోత్పత్తికి పది యూనిట్ల శక్తి వినియోగమవుతుంది.అంతే కాకుండా ఈ రకమైన ఆహారం వలన 300 లకు నూతన వ్యాధులకు లోనవుతున్నారు.మధుమేహం,హైపర్‌ ‌టెన్షన్‌ ,‌గుండె ప్రసరణ వ్యాధిగ్రస్తుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి.ఇంకా నీరు,నేల వనరులను వినియోగం అధికంగా ఉంటుంది.ఈ వనరుల లభ్యత తగ్గిన తర్వాత మరల కరువులు, ఆహార సంక్షోభం సంభవిస్తాయి.

- Advertisement -

పారిశ్రామిక ఆహారోత్పత్తి లో ప్రధానంగా మాంసం ఉత్పత్తికి కృత్రిమ వాతావరణంలో పెంచే పశువులకు అధిక మోతాదులో ఆహార ధాన్యాలను ఇవ్వడం జరుగుతుంది. మొక్కలను,జంతువులను,మనుషులను ముడిసరుకులుగా భావించే ఈ ధోరణుల వలన అనేక సహజ అవాసాలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి భూమి మీద మూడవ వంతు జంతుజాలం తమ సహజ ఆవాసం నుండి వ్యవసాయ క్షేత్రాలకు బదిలీ అయ్యాయి.వీటిలో 62% తీవ్ర ప్రమాదకర స్థాయికి,మరి కొన్ని అంతరించే దశకు చేరుకున్నాయి. మనిషికి, జంతువులకు ,ప్రకృతికి సమతుల్యత తగ్గి అనేక మహమ్మారులకు కారణం అవుతున్నాయి. జీవనానికి ఆధారం ఐన వ్యవసాయ,ఆహారం వ్యాపార వస్తువైన అమానవీయ దశకు చేరుకున్నాము.భూమిని శకలాలుగా విభజించి లాభార్జన ధ్యేయంగా గల పారిశ్రామికత తో వినియోగించుకుని వ్యర్ధాలను,కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి.

ఈ వినాశకర చర్యలను ఆపకపోతే మనిషి తనను తాను అంతరించే స్థితి మరెంతో దూరంలో లేదు. ప్రపంచీకరణ అపశ్రుతి ఐన అసమతుల వ్యవసాయ ఆహార విధానాలను అపుచేయాలి.దూరాశతో కూడిన అపరిమిత వృద్ధి విధానం బదులు సుస్థిర సమ్మిళిత విధానాలకు ప్రాధాన్యం కలిగించాలి.పాకేజ్డ్ ‌త్రో అవే ఆహార సంస్కృతి విడనాడి వసుధైక కుటుంబ తాత్వికత ను కలిగి ఉన్న త్రో బ్యాక్‌ ‌భారతీయ వ్యవసాయ ములాల్లోకి వెళ్ళాలి.అతి తక్కువ నీటి వినియోగంతో అత్యధిక పోషకాలు ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. సేంద్రియ జీవ వైవిధ్య నవధాన్య విప్లవాన్ని కొనసాగించాలి.ఈ మార్పులతో పెరుగుతున్న ప్రపంచ జనాభా అవసరాలను సమృద్ధిగా తీర్చుతుంది.అప్పుడు మాత్రమే మానవునికి ఆరోగ్యం,భూగ్రహనికి స్వస్థత చేకూరుతుంది.

asnala srinivas
అస్నాల శ్రీనివాస్‌
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం.

Leave a Reply