Take a fresh look at your lifestyle.

ప్రకృతి దేవుడిచ్చిన గొప్ప వరం

  • పర్యవారణ దినోత్సవం సందర్బంగా సిం జగన్‌ ‌ట్వీట్‌
  • ‌కరకంబాడిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటిన టిటిడి ఇవో

అమరావతి,జూన్‌ 5 : ‌ప్రకృతి దేవుడు మనకు అందించిన గొప్ప వరం.. సహజవనరులే మన సంపద అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ప్రకృతి.. దేవుడు మనకు అందించిన గొప్పవరం. సహజవనరులే మన సంపద. మొక్కలు పెంచి కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని తగ్గిస్తూ.. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలి. భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలి..

ఇది మనందరి బాధ్యత‘అంటూ సీఎం జగన్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఇదిలావుంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు, పర్యావరణాన్ని కాపాడాలని టిటిడి ఇవో జవహర్‌ ‌రెడ్డి అన్నారు. చిత్తూరు కరకంబాడి సపంలో ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మొక్కులు నాటారు. ప్రత్యేకంగా వేమ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ ‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

Leave a Reply