Take a fresh look at your lifestyle.

ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత

నేడు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
ఈ విశ్వంలో జీవరాసులు అన్నింటి మనుగడకు మూలం అయినభూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాలను ప్రకృతే ఈ విశ్వానికి అందించింది.అయితే ఈ పంచభూతాల నిష్పత్తిలో సమతౌల్యం లోపించడం వలనజీవనం అస్తవ్యస్త మవుతూ ఉంది.ఈ అనంత విశ్వంలో ప్రకృతికి మన అవసరం ఎంత మాత్రం లేదు. కానీ ఆ ప్రకృతి, వాతావరణ సమతౌల్యత మానవ మనుగడకు అవసరం. ఈ చరాచర ప్రకృతిలో మనిషి ఒక భాగం మాత్రమే.తనతో పాటు ఈ విశ్వంలో కోట్లాది జీవరాసులు ఉన్నాయని వీటి అన్నింటి ఉమ్మడి ఆస్తి ప్రకృతి అనే విచక్షణను మనిషి కోల్పోతున్నాడు.

ప్రకృతి శక్తి ముందు మానవశక్తి పరిమితం మాత్రమే అని మానవుడు గ్రహించలేక పోతున్నాడు..ఈ కారణం చేతనేతన భౌతికా వసరాల కోసం తరతరాల ప్రకృతిని విధ్వంసం చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. మన మనుగడ కోసం ఎన్నో అందించిన తర తరాల నాటి ప్రకృతిని విధ్వంసం చేయడానికి పూను కున్నాడు. ఈ దిశగా ప్రకృతిపై ఆధిపత్యం సాది •స్తున్నాను అంటూ తాను అగాధంలో కూరుకు పోతున్నాడు. తాను బ్రతకాలంటే, ముందు ప్రకృతిబ్రతకాలనే ఇంగితజ్ఞానం మనిషి కోల్పోతున్నాడు.ప్రకృతిని మనం ఎంతగా ప్రేమిస్తే, ప్రకృతి అంతగా మనల్ని ప్రేమిస్తుంది మనకుబ్రతుకునిస్తుంది అనేది విస్మరించి మనిషి చేసే విధ్వంసకర చర్యలు వలన నేటి తరమే కాదు భవిష్యత్తులోని అనేక తరాలకు శాపంగా మారుతుందని గ్రహించడం లేదు కోటాను కోట్ల సంవత్సరాలుగా సజీవంగా, స్వచ్చంగా ఉన్న ఈ ప్రకృతి 19వ శతాబ్దం నుండి మానవ చర్యల వల్లనే విధ్వంసానికి గురి అవు తున్నది.ఈ ప్రకృతిలో మానవుడు తప్పమిగిలిన జీవులన్నీ ప్రకృతి చెప్పినట్టు నడుచుకుంటున్నాయి.

అయితే ప్రకృతికి భిన్నంగా నడిచే మానవుని ప్రతికూల చర్యలు వలన ఏ పాపం ఎరుగని మూగ జీవాలు మూల్యం చెల్లించవలసి వస్తున్నది. మానవుడు మాత్రం సాధించాను అని చెప్పుకుం టున్న శాస్త్ర,సాంకేతిక మరియు జీవావరణ రంగాలలో సాధించిన ప్రగతి దానివలన కలిగిన మార్పులు మాత్రం ప్రకృతి స్వచ్చతకు ముప్పుగా ఏర్పడ్డాయి.ఒక పక్కపంటలు క్రిమి సంహారకాలతో రోగ కారకాలవుతున్నాయి.మరొక పక్క అతినీలలోహిత కిరణాలనుండి మనల్ని కాపాడిన ఆకాశపు ఓజోను పొరలో మానవాళి స్వార్ధం వల్ల ఏర్పడ్డ రంధ్రాలు రాను రానూ విస్తరిస్తున్నాయి., వీటితో పాటుపట్టణీకరణ, పారిశ్రామిక విప్లవం,అడవుల నరికివేత,వనరుల విధ్వంసం,మితిమీరిన ప్లాస్టిక్‌ ‌వాడకం,ప్రకృతిని నాశనం చేస్తున్నాయి.మానవుడు మాత్రం వీటి అన్నింటికీ అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టుకుని ప్రకృతిని విభిన్న రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు.దీని వలన మానవుడే కాదు అభం శుభం ఎరుగని అసంఖ్యాక జంతు,వృక్ష జాతులలో కొన్ని ఇప్పటికే అంతరించి పోయాయి మరి కొన్ని అంతరించి పోతున్న జాబితాలోనికి చేరాయి.

మనం ఈ సృష్టికి కేవలం అతిధులం మాత్రమే.ఉన్నన్ని రోజులు ప్రకృతి అందించిన వనరులు ఉపయోగించుకుంటూ సృష్టిలోని అందాలను ఆస్వాదిస్తూ, తరువాతి తరానికి జాగ్రత్తగా అందించాలి. ఎందుకంటేఈ భూమిపై ఉన్న వనరులన్నీ తరతరాల వారసత్వ సంపదగా మనకు దక్కినవి ! వీటిని ముందు తరాల కోసం పదిల పరుస్తూ,అనుభవించే హక్కు మాత్రమే మనకుంది. సమస్త జీవ కోటితో నిండిన ఈ ప్రకృతిని సమిష్టిగా పంచుకోవాలి. ఇప్పటికే ప్రకృతిలో ఎన్నో తరాలు గడిచిపోయాయి.మనంప్రస్తుత తరంలో ఉన్నాం. అయితేగడిచిన తరాలు వారు ప్రకృతి ఇచ్చిన వనరులను పొదుపుగా సంతులనం గా వాడుకుని ప్రస్తుత తరమైన మనకు వనరులు అందించారు. కానీ మనం మాత్రం వనరుల వినియోగం లో స్పృహ లేకుండా అపరిమితంగా వినియోగిస్తూ పరిమిత వనరులను కాలుష్యం చేస్తూ భావితరాల వారికి ఏమీ లేకుండా చేసే పనిని నిరాటంకంగా కొనసాగిస్తున్నాం.మన వారసులైన సంతానానికి మాత్రం సంపద కూడ బెట్టి వారసత్వ సంపదగా ఇవ్వాలని తపన పడుతున్నాం కానీ ఆ సంపదను సంపూర్ణంగా అనుభవించాలి అంటే స్వచ్ఛత గల ప్రకృతి అవసరం అనే సత్యాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాం.పర్యావరణ పరి భాషలో చెప్పాలంటే సుస్ధిర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాం.ఈ ధోరణి వలన భావితరాల వారే కాదు ప్రస్తుత తరమైన మనం అనుభవిస్తున్నాం.

విచక్షణరహితంగా అటవీసంపదను ధ్వంసం చేయడం వలన నేడు33 శాతం అడవులు ఉండవలసిన దేశంలో 21శాతానికి మించి లేవు.సగటున రోజుకి 333 ఎకరాల అటవీ భూమి అదృశ్యమై పోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. విచక్షణారహితంగా అటవీ సంపదను ధ్వంసం చేయడం వలన వర్షా భావ దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. మానవ చర్యల వలన గాలి కాలుష్యం అవుతున్నది. గాలి కాలుష్యం వలన ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలియచేసింది.దేశంలో కలుషిత నీటివలన ఏటా రెండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారని నీతి ఆయోగ్‌ ‌గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన సౌకర్యాల కోసం ఉపయోగించే వస్తువులు మరియు పారిశ్రామికీకరణ,పట్టణీకరణ వంటి వాటి ఫలితంగా వాతా వరణం లోనికి అపరిమి తంగా కర్బన ఉద్గారా లను విడిచి పెట్టి భూగోళం అగ్ని గోళ ంగా మార్చే సిగ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌కు కారణం అ య్యాం.ఓజోన్‌ ‌పొర క్షీణతకు ప్రత్యక్షంగా మన చర్యలే కారణం అంతే కాదు.

మనకు ఊపిరి ఇచ్చే వాయువును కూడా కాలుష్య భరితం చేసేసాం.స్వచ్ఛ జలాలు గల నదులను చెత్త కుండీలుగా మార్చేసి తాగడానికి మంచి నీరు కరువైన పరిస్దితి తెచ్చుకున్నాం. పంటల దిగుబడిలో కీలకపాత్ర పోషించే తేనెటీగలు అంతరించి పోయే స్దితికి మనమే కారణమై ఆహార విపత్తును త్వరలో ఎదుర్కోబోతున్నాంప్రస్తుత పరిస్ధితులను పరిశీలించిన ఇంటర్నేషనల్‌ ‌యూని యన్‌ ‌ఫర్‌ ‌కన్జర్వేషన్‌ ఆఫ్‌ ‌నేచర్‌’ అనే అంతర్జా తీయ సంస్థపరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచం మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రస్తుత పరిణామాలు వలనప్రపంచంలోని ప్రతి నాలుగు జీవజాతుల్లో ఒకటి అంతరించిపోయే దశలో ఉన్నట్లు కూడా అభిప్రాయపడింది.మానవ మేధస్సు ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము ద్వారా ఎన్నో ఆవిష్కరణలు చేశాం దాని ఆధారంగా ఎంతో పురోగతి సాధించాం. నిజమే అయితే ఈసాంకేతిక పరిజ్ఞానం మాత్రం పర్యావరణ క్షీణతకు కారణం అవుతూ ఉంది.దీనివలన పర్యావరణ వినాశకరణ ధోరణులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రకృతిని పరిరక్షించు కోకుండా విధ్వంసం చేయడం వల్లే అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుం టున్నాయి. ఋతువులు గతి తప్పుతున్నాయి.ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతు న్నాయి. వరదలు ముంచెత్తు తున్నాయి.

తుపాన్లు వణికిస్తు న్నాయి.భూకంపాలు భయపెడు తున్నాయి.రోజుకొక రూపం మార్చుకుంటున్న ప్రాణాంతక వైరస్‌ ‌లు మన ముంగిట సాక్షాత్కరిస్తున్నాయి.మందులేని మృత్యువుకు ప్రతిరూపమైన వైరస్‌ ‌మహమ్మారిని అడ్డుకొనేందుకుప్రపంచం అంతా పరిశోధనలు చేపడుతూ ఉన్నా ఇంకా పరిష్కారం లేని స్దితిలో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం. వీటికితోడు ప్రకృతి ఉపద్రవాలు, మానవదోషాలు ఒకదానికొకటి తోడై నేడు ప్రపంచం భయం భయంగా జీవనాన్ని కొనసాగిస్తోంది. వీటిని అధిగమించిమానవుడు సుఖమయ జీవనం సాగించాలి అంటే ప్రకృతిని కాపాడుకోగల గాలిదీనికి భిన్నంగా మానవుడు ప్రకృతిని జయిం చాలని వెడితే మాత్రం అది తిరగబడి తన ఆధీనంలోకి తీసుకుంటుందని ఎన్నో అనుభవాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి.మానవుడు చేసే ప్రకృతి విషయంలో చేసే ప్రతీ విధ్వంసం కూడా భవిష్యత్‌ ‌తరాలకు శాపంగా మారుతుందనే విషయం మాత్రం మరువకూడదు ఈ విషయంలో సహజ వనరుల ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించి, సహజ వనరులను రక్షించే పద్ధతులను గురించి ప్రజలకు తెలియజేయుటకు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం జులై 28 వ తేదీన జరుపుకు ంటున్నాము.

ఈ సంవత్సరం ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ధీమ్‌ ‌గా‘‘అడవులు మరియు జీవనోపాధి: ప్రజలను మరియు గ్రహాన్ని నిలబెట్టడం’’ అనే దానిని నినాదంగా ప్రకటిం చడం జరిగింది.ప్రపంచంలోని ప్రతి ఒక్కరు సహజ వనరులను మరియు ప్రకృతిని రక్షించడానికి కృషి చేయగలిగితే.అప్పుడు ప్రకృతి సకల జీవ కోటిని కాపాడుతుంది.ప్రపంచ పౌరులుగా ప్రకృతి సమతుల్యత లోపించకుండా చూసుకోవడమనేది మనందరి బాధ్యత..భావితరాల కోసం ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభం జరిగింది.అంతర్జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణకై అనేక చట్టాలు చేశాయి.వాటిని ఆమోదిస్తూ దేశాలు సంతకాలు చేశాయి. దానితో పాటు దేశీయంగా కూడా అనేక పర్యావరణ పరిరక్షక చట్టాలు ఘనంగా రూపకల్పన చేశాం. అయితే వాస్తవంలో మాత్రం అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు.దీనినిబట్టి చట్టాలు శాసనాలు ద్వారా అనూహ్య మార్పులు రావని అర్ధం అవుతూ ఉంది.ఈ మార్పు అనేది వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరి నుండి ఆరంభం కావాలి ప్రతీ ఒక్కరి ఇంటి నుంచి దీనికి చిత్తశుద్ధితో శ్రీకారం చుట్టాలి. అప్పుడే మనం ప్రకృతి మాతను కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం.చేయి చేయి కలుపుదాం.మన భావితరాలకు స్వచ్ఛ ప్రకృతిని బహుమతిగా ఇవ్వగలుగుతాం.మనం బ్రతుకుదాం.. ప్రకృతిని బ్రతికిద్దాం..

-రుద్రరాజు శ్రీనివాసరాజు..9441239578.
లెక్చరర్‌..ఐ.‌పోలవరం

Leave a Reply