- పది మెడల్స్ సాధించిన మృతుడు :బొప్పాపూర్ గ్రామంలో విషాదం
కుస్తీ పోటీలలో తనదైన శైలీలో రాణిస్తూ అంతరాష్ట్ర పోటీలలో గోల్డ్‌మెడల్స్‌తో పాటు పది వివిధ
మెడల్‌లను సాధించి అందరికి ఆదర్శంగా ఉండవల్సిన యువకుడు కొన్ని నెలల క్రితం ఇంటివద్దనే ఉంటూ మనస్థాపానికి గురై ఇంటివద్దనే ఉంటు ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన కుస్తీ యోధుడు భుజంకర్ శ్రీనివాస్ (24) గత నెల 30న ఆత్మహత్యయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. భుజంకర్ శ్రీనివాస్ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని
చిన్నతనం నుండి హైదరాబాద్‌లోని ప్రభుత్వ క్రీడలకు చెందిన పాఠశాలలో చదివి రెజ్లింగ్ శిక్షణ పొందాడు. తన ప్రతిభ, నైపుణ్యంతో జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. చిన్నతనంలో తండ్రిని కోల్పొయిన శ్రీనివాస్ పట్టుదలతో చదువుకుంటూ క్రీడల్లో రాణించి గోల్డ్ మెడల్స్‌తో పాటు పది మెడల్స్‌ను సాధించాడు.
దేశంలోని డీల్లీ, హర్యానా, హిమచల్ ప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో జరిగిన జాతీయ రెజ్లింగ్ పోటీలలో రాణించాడు. గత కొంత కాలంగా క్రీడలకు ఆదరణ తగ్గడంతో గ్రామంలో ఉంటూ ముగ్గురు సోదరులు చేస్తున్న చికెన్, మటన్ వ్యాపారంలో సహాయ పడుతూ ఉండేవాడు. అందరితో కలిసి మెలసి ఉండే శ్రీనివాస్ గత నెల 30న కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలుపుకొని సేవించి ఇంట్లో చెప్పక పోవడంతో పరిస్థితి విషమించింది. ఈ నెల 4వ తేదిన కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉంటుండడంతో నిలదీయగా మందు సేవించినట్లు చెప్పడంతో మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ నుండి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడకూడా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.