
మన దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..జనాభాలో రెండవ స్థానంలో ఉందనిమనం గర్వంగా చెప్పుకుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం ఓటర్లు. అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. 1950 జనవరి 25 న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (భారత ఎన్నికల సంఘం) ఏర్పాటు చేయడం జరిగిన రోజు. 2010 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించి 2011 జనవరి 25న తొలి ఓటర్ల దినంగా ప్రకటించారు. దీనిని స్పురణకు తెచ్చేలా ఓటు విలువను చాటిచెప్పేల యువ ఓటర్లను ఎన్నికలలో పాల్గొనేలా ప్రోత్సహించే దిశగా అర్హత ఉన్న ఓటర్లను పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తుంది. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య భారత దేశంలో ప్రతి పౌరుడికి కుల, మత, వర్ణ, వర్గ, భాష, లింగ, ప్రాంతీయ భేదం లేకుండా ఓటును వినియోగించుకునే హక్కు అందరికీ వుంది. దీనినే సార్వజనీన ఓటు హక్కు అంటారు. ఓటర్ల అందరినీ కలిపి ఎలక్టోరేట్ అంటారు. ప్రారంభంలో రాజ్యాంగంలో ఓటింగ్ వయస్సు 21 ఏళ్లు ఉండేది కానీ, 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు పొందే వయస్సు 18 సంవత్సరాలకు తగ్గించారు. ఎన్నికల సంఘం ప్రతి 5 సంవత్స్రాలకొకసారి, ఎన్నికలు జరిగే ప్రతి సందర్భంలో ఓటరు జాబితాను సవరించుకుంటుంది.
సమర్థవంతమైన నాయకుణ్ణి ఎన్నుకోవడంపై దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటింగ్ పైన అవగాహన కలిగిస్తూ మరియు ఓటింగ్ హక్కుల పట్ల యువతారాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపు కుంటారు. మనం ఎన్నుకునే నాయకులు ఎవరు నచ్చనట్లయితే వారిని తిరస్కరించే ఓటు ‘నోటా’’. 2013లో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దీనిని ప్రవేశ పెట్టారు. నోటా అనేది వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నోటా ఐచ్ఛికాన్ని మొదటిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, శాసనసభ ఎన్నికలు 2013లో ప్రవేశ పెట్టారు. నోట అనేది కేవలం ఓటరుకు ఉన్న ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థి గెలుపు లేదా ఓటమిని ఏ మాత్రం ప్రభావితం చేయదు. ఒకవేళ నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఓటరు తన నివాస స్థలాన్ని మార్చినప్పుడల్లా ఎన్నికల సంఘానికి తెలియ జేయాలి. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవగాహన కొరకు పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఓటర్ల చేత ప్రతిజ్ఞను నిర్వహిస్తారు. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందిన వారికీ ఓటరు గుర్తింపు కార్డులను అందజేస్తారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండ నీతి నిజాయితీపరులైన సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలి. ఓటు వేసేటప్పుడు కచ్చితంగా నేర చాారిట్్రరఆ నిస్వార్థపరుడైన మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఓటు వేయకపోవడం ఎంత నేరమో వివిధ ప్రలోభాలకు లోనై ఆ వ్యక్తికి ఓటు వేయడం కూడా అంతే నేరం. మనం మంచి ప్రతినిధు లను ఎన్నుకున్నప్పుడే వారు మనకు మంచి పరిపా లన అందించగలరు.
నెరుపటి ఆనంద్
ఉపాధాయులు
టేకుర్తి
9989048428
ఉపాధాయులు
టేకుర్తి
9989048428