Take a fresh look at your lifestyle.

జాతీయ రహదారుల నిర్మాణ పనుల వేగం పెంచాలి

  • నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలి
  • అధికారులను ఆదేశించిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌
  • ఔటర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతులు

రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన ముందస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.రహదారులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని కూడా అధికారులకు సూచించారు. బుధవారం ఈ అంశంపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం నిర్వమించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి యుటిలిటీ షిప్టింగ్‌, ‌భూసేకరణ, అటవీ అనుమతులు తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్‌ ‌మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌ ‌సమస్యలను జిల్లాల వారీగా తయారు చేయాలని, జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సక్షించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ, మెట్రోవాటర్‌బోర్డు, జీహెచ్‌ఎం‌సి, ట్రాన్స్‌కో, మిషన్‌ ‌భగీరధ విభాగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో రవాణా, రోడ్డు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, రీజినల్‌ ఆఫీసర్‌ ‌రవి ప్రకాశ్‌, ‌నేషనల్‌ ‌హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా అధికారి క్రిష్ట ప్రసాద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ఔటర్‌ ‌రింగ్‌రోడ్డుపై వాహనాలకు అనుమతి
లాక్‌డౌన్‌ ‌కారణంగా దాదాపు రెండు నెలలుగా మూతపడ్డ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు తెరుచుకోనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు హెచ్‌ఎం‌డీఏ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని హెచ్‌ఎం‌డీఏ, హైదరాబాద్‌ ‌గ్రోత్‌ ‌కారిడార్‌ ‌లిమిటెడ్‌ (‌హెచ్‌జీసీఎల్‌) ‌నిర్ణయం తీసుకున్నాయన్నారు. వాహనాలను అనుమతిస్తున్నందున ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్‌ఆర్‌పై టోల్‌గేట్‌ ‌నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్‌ఎం‌డీఏ, హెచ్‌జీసీఎల్‌ ‌నిర్దేశిరచాయి. డిజిటల్‌ ‌పేమెంట్‌ ‌పద్ధతిలో ఫాస్టాగ్‌ ‌చెల్లింపులకు అవకాశం ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్‌ఎం‌డీఏ సూచించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటున్న నేపథ్యంలో ఆ సమయంలో ఓఆర్‌ఆర్‌పై కార్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల్లో ప్రయాణికులున్నట్లుగా టోల్‌ ‌సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని హెచ్‌ఎం‌డీఏ అధికారులు తెలిపారు.

Leave a Reply