లక్నో, ఎక్స్ ప్రెస్ హైవే.. చేతిలో బీఎండబ్ల్యూ కారు.. ఇంకేముంది ఆనం దానికి అవధుల్లే కుండా పో యి ంది. దాదాపు 200 కిలో టర్లకు పైగా వేగంతో దూసు కుపోయారు. అంతే కాదు కాసేపట్లో 300వేగాన్ని టచ్ చేస్తామని కూడా చెప్పారు. ఆ విషయాన్ని వీడియో తీస్తూ ఫేస్ బుక్ లైవ్ కూడా పెట్టారు. ఆ వెంటనే వెనక సీట్లో కూర్చున్న మరో వ్యక్తి ఇలాగే నడిపితే చస్తామని కూడా చెప్పాడు. ఇంతలోనే అన్న మాటే నిజమైంది. ఊహించని స్థాయిలో అత్యంత స్పీడ్ తో దూసుకొచ్చిన ఆ కారు, ఓ ట్రక్కును ఢీకొంది. ఇంకేముంది.. వాళ్ల నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే పై చోటు చేసుకుంది. బీహార్ రోహ్‌తాస్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ ఆనంద్ ప్రకాశ్ బీఎండబ్ల్యూ కారును నడుపు తున్నాడు. ఆ కారులో అతనితో పాటు అతని స్నేహితులు దీపక్ కుమార్ (ఇంజనీర్), అఖిలేశ్ సింగ్ (రియల్టర్), ముఖేష్ (వ్యాపారి) ఉన్నారు. వాళ్లంతా బీహార్ నుంచి ఢిల్లీకి కారులో వెళ్తున్నారు.
ఆ సమయంలోనే వారు వెళ్లే కారు వేగాన్ని ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి మరీ చూపించారు. ఈ వీడియోలో కారు స్పీడు 230 దగ్గర ఉంది. అయితే తన స్నేహితులు ఎంకరేజ్ చేయడంతో డ్రైవింగ్ చేస్తున్న ఆనంద్ ప్రకాశ్ సైతం కారు వేగాన్ని పెంచాడు. ఈ క్రమంలోనే వారు ట్రక్కును ఢీకొట్టారు.ఈఘటనలోకారుపూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈఘోర ప్రమాదంలో ఓ యువకుడి తల, చేయి 20 నుంచి 30టర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పూర్తి కాలేదని, అక్కడక్కడా ఇంకా ప్యాచ్ వర్క్ నడుస్తోందని.. ఈ విషయం తెలియక వారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని పోలీసులు తెలిపారు.