Take a fresh look at your lifestyle.

‌భారత జాతీయ పతాక విశిష్టత

ఒక దేశం యొక్క ఆశయాలకు ఆదర్శాలకు, సంప్ర దాయాల•కు సిద్ధాం తాలకు ప్రతి రూపం ఆ దేశ పతాకమే… ఈ పతాకం అనేది స్వతంత్ర జాతి ఉనికికి నిదర్శనం.జాతి శక్తికి ప్రతీక,ఆదర్శాలకు సం కేతం, నమ్మకాలకు నీరాజనం. ప్రపంచంలో స్వతంత్ర ప్రతిపత్తి గల దేశాలన్నిటికి తమతమ జాతీయ ధర్మాలను సూచించగల జాతీయ పతాకాలుంటాయి. 70 సంవత్సరాలకు పూర్వం అనేక పరిణామాల అనంతరం మన దేశానికొక జాతీయ పతాకం ఏర్పడింది.ఎన్నో మహత్తర ఆశయాలకు సంకేతంగా ఏర్పడిన త్రివర్ణ పతాకం ఆనాటి నుండి స్వతంత్ర భరతజాతి పవిత్రమైన త్రివర్ణ పతాక నీడన పలు విధాలైన స్ఫూర్తులనందుకొంటూ పయనం సాగిస్తోంది.ఆ పతాకానికి ఉన్న సాంస్కృతిక , రాజకీయ విలువలే ఈ జాతి వ్యక్తిత్వాన్ని ఇనుమడి ంపజేశాయనడంలో అతిశయోక్తి లేదు.ప్రతి దేశం కూడ తమ జాతీయ పతాకాన్ని గౌరవిం చడంలోను, వినియోగించడంలోను, కొన్ని నిర్దుష్టమైన నియమాలను పాటిస్తుంది. మన భారత దేశం కూడ ఈ విషయంలో జాతి గౌరవ మర్యాదలకు అనుగుణంగానే జాతీయ పతాకను ప్రతిష్టించుకుంది. దానికొక వినియోగ నిబంధనావళిని’’ ఫ్లాగ్‌ ‌కోడ్‌ -ఇం‌డియా’’ పేరుతో నిబంధనావళిని రూపొందించింది.

ఈ దేశంలో ప్రతి పౌరుడు ప్రప్ర థమంగా జాతీయ పతాకాన్ని గౌరవించడాన్ని అలవరచుకోవాలి.జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ((hoisting)), దించడం (lowering),), అభివాదం చేయడంsaluting)), సగానికి దించడం(half-masting) వంటి సాధారణ సంప్రదాయాలను తెలుసుకొని పాటించవలసి ఉంటుంది.జాతీయ పతాకం పట్ల శ్రద్ధను ప్రదర్శించడం అంటే దాన్ని సందర్భోచితంగా నిబంధనలను అనుసరించి వినియోగించడంతో పాటు దానికి వాడవలసిన వస్త్రం విషయంలోను రూపొందించబడిన నిబంధనలను విధిగా పాటించవలసి ఉంటుంది.

కేంద్రీయ గృహమంత్రాలయం మరియు ప్రధాన  సైనిక కార్యాలయం వారి అభ్యర్థనను పురస్కరించుకొని భారతీయ వస్తు నాణ్యత పరిశీలనా సంస్థ వారు ఈ విషయంలో దానికి తగు రూపురేఖలు దిద్ది స్థిర రూపాన్ని ఇచ్చారు.ఈ సంస్థ  ఎప్పటికప్పుడు జాతీయ పతాకానికి సంబందించిన మూడు రంగుల నాణ్యత విషయంలో రసాయనిక పరిశోధనలు జరిపి ధృవపరుస్తుంది.అలా ధృవపరచబడిన పతాక నమూనాను తమ వద్ద సీలు వేసి భద్రపరుస్తుంది.అలా నాణ్యత నిర్దారణ సంస్థ వారి అనుమతి పొంది ఉత్తరప్రదేశ్‌ ‌లోని షాజహాన్‌ ‌పూర్‌ ‌నందలి ఒక ఫ్యాక్టరి జాతీయ పతాకాలను చట్టాలకు లోబడి తయారు చేస్తూ ఉంటుంది.

జాతీయ పతాకానికి ప్రతి వస్త్రం పనికిరాదు.పత్తిని రాట్నంపై వడికి చేమగ్గంపై తయారు చేసిన శుద్ధ ఖద్దరు వస్త్రం కావాలి.దీనికి శాస్త్రీయ పద్దతిపై రంగులు వేయాలి.తెలుపు రంగు మినహాయించి మిగతా రెండు రంగులు రసాయనిక పరిశోధనలకు నిలబడగలిగే టట్లుండాలి.జెండా వస్త్రానికి కావలసిన రంగులు వేయడం కూడ నాణ్యత నిర్ధారణ సంఘం వారి గుర్తింపు పొందిన పరిశ్రమలలోనే జరుగుతుంది. జాతీయ పతాకమందలి మూడు రంగుల పట్టీలు సమ పరిమాణంలోనే ఉండాలి.పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 గా ఉండాలి.2001 డిశంబర్‌ 30‌తేదిన మన భారత ప్రభుత్వం ఫ్లాగ్‌ ‌కోడ్‌ ‌లో కొన్ని సవరణలు చేసి పాలిస్టర్‌,‌సిల్క్,ఉన్ని వస్త్రంతో తయారుచేసిన జెండాతో పాటుగా మెషిన్‌ ‌తో తయారు చేసిన జెండాలను కూడ ఎగురవేయవచ్చని ,ఫ్లాగ్‌ ‌కోడ్‌ ‌లో పార్ట్-2‌లోని 2.2 పేరాలోని క్లాజ్‌-•× ‌ప్రకారం ప్రతి ఇంటి పై కూడ నిబంధనలు పాటిస్తూ జెండా ఎగురవేయవచ్చు అని ప్రకటన కూడ చేసింది.

అత్యున్నత హోదా కలిగిన జాతీయ స్థావరాలు మొదలుకొని సాధారణ జిల్లాస్థాయి సంస్థా నిలయాల వరకు ఆయా స్థలాల్లో ఎగురవలసిన జాతీయ పతాకను ప్రభుత్వం వివిధ సైజులలో స్థిరపరచి పెట్టింది.ఈనాడు అవి 21అడుగుల పొడవు,14 అడుగుల వెడల్పు గల పెద్ద పరిమాణం మొదలు 6 అంగుళాల పొడవు,4 అంగుళాల వెడల్పుగల చిన్న పరిమాణం వరకు 9 సైజులలో లభ్యమవుతూ ఉంటాయి.
జాతీయ పతాకం ఆవిష్కరించబడవలసిన స్థలం, పరిసరాలు పరిశుభ్రంగా,గౌరవనీయంగా ఉండాలి.అమర్యాదకరమైన, అసభ్య వాతావరణం మధ్య, అసందర్భాలలో జెండా ఎగుర వేయరాదు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు అన్ని దినాలలో జెండాను ప్రదర్శించవచ్చు.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప రాత్రి సమయాలలో జెండా ఎగురరాదు.సాధారణంగా జెండాను ఆవిష్కరించేటపుడు దానిని పైకి  కొంచెం వేగంగా లాగాలి. దించేటపుడు కొంచెం నెమ్మదిగా సవినయంగా దించాలి. జెండాను దించేటపుడు ఎటువంటి తొంద రపాటును ఆదుర్దాను ప్రదర్శించరాదు.జెండాను ఆవిష్కరించువారు గాంభీర్య ముద్రలో స్థిర చిత్తత కలిగినవారై ఉండాలి.నేర చరిత్ర లేనివారుగా అంకితభావం కలిగినవారుగా ఉండాలి. జెండాను దించేటపుడు అది వారి కుడి భుజం వరకు వచ్చి ఆగాలి.జెండా ఎక్కడ  ఏ రూపంలో ఎగురవేసినా కాషాయ రంగు పైకి అనగా ఆకాశంవైపు ఉండేటట్లుగా..ఆకుపచ్చ రంగు కిందికి అనగా భూమి వైపు ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.పతాకం ఎట్టి పరిస్థితిలో నేలను తాకరాదు.గాలిలో ఎగురుతూ ఉండాలి.ఉపన్యాస వేదికలపై జాతీయ పతాకం అవసరమైనపుడు అది ఉపన్యాసకునికి కుడివైపు అమర్చబడాలి.వేదికకు కుడివైపు అగ్రభాగంలో ఉండాలి.

మోటారు వాహనాలపై జాతీయ పతాకం ఉండవలసి వస్తే అది ఆ కారు ముందుభాగంపై ఎగిరేటట్లు అమర్చాలి. వెనుక గాని పక్కకు గాని అమర్చరాదు.ఊరేగింపులు, కవాతులు చేయవ లసిన సందర్భాలలోజాతీయ పతాకంతో ఊరేగి ంపుకు కుడివైపుగా నడవాలి.ఈ ఊరేగింపులో ఇతర జెండాలు కూడ పాల్గొన్న పుడుఅగ్ర  బాగంలో మొదటి పంక్తిలో మధ్యగా నడవాల్సి ఉంటుంది.చిరిగి పోయిన, తూట్లు పడినవి, మరకలుపడినవి, మాసిపోయి వేలిసి పోయినవి, కొలతలు సరిగా లేనివి జాతీయ పతాకంగా వినియోగించబడరాదు. శాస్త్రీయంగా తయా రుచేసిన శుభ్రమైన పతాకనే వినియోగించాలి. ఏ సందర్భంలోనైనా ఇతర పతాకాల కంటే జాతీయ పతాకం ఉన్నతంగా ఎగిరేటట్లు చూడాలి.జాతీయ పతాకం ఎగురుచున్నపుడు దానిపై దానికంటే ఉన్నతంగా పూలు పూలమాలలు తదితర చిత్రాలు చిహ్నాలు ఏమీ అలంకరించి ఉండరాదు.పాత బడిన జెండాను సైతం ఇతర పనులకు వాడరాదు.ప్రభుత్వ లాంచనాలతో, సైనిక లాంఛనాలతో జరిగే దహనక్రియల సందర్భంలో శవంపై,శవ పేటికపై గౌరవార్థం జాతీయ పతాకాన్ని కప్పవచ్చు. ఆ సమయంలో కాషాయ రంగు తలవైపు ఉండేలా చూస్తారు.శవ దహనానికి ముందు ఆ పతాకాన్ని భౌతికకాయం నుండి తొలగిస్తారు.జాతీయ పతాకంపై ఏదో అభిమానంతో ఏమీ రాయకూడదు. అక్షరాలను ఎంబ్రాయిడరీ చేయడం ముద్రించడం వంటివి చేయకూడదు.

వ్యాపార ప్రకటనలకు వినియోగిం చరాదు. ఎటువంటి ప్రకటనల గుర్తులను అంటిం చరాదు.అలక్ష్య భావంతో ఉద్దేశ్యపూర్వకంగా పతాకాన్ని అవమానించడం వంటి చర్యలకు పాల్పడితే ‘‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్ ‌టు నేషనల్‌ ‌హానర్‌ ఆక్ట్1971’’ ‌ప్రకారం శిక్షార్హులు.జాతీయ పతాక వస్త్రం శిథిలమై ప్రదర్శనకు ఉపయుక్తం కాని పక్షంలో మూలన పడవేయడం కూడ నేరమే.కాబట్టి దానిని గౌరవ ప్రదంగా కాల్చివేయడం శ్రేయస్కరం.
జాతీయ పర్వదినాలైన స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో పతాకావిష్కరణ, అభివందనం అనేవి తప్పక జరగాలి.పతాకాన్ని ఆవిష్కరించడం అవనతం చేయడం వంటి సంద ర్భాలలో ఆయా సభలలోను, సమావేశాలలోను హాజరైన వారందరు జెండాకు అభిముఖంగా సమాదర నిష్ఠతో నిలబడాలి.భక్తి శ్రద్ధలను పాటించాలి. సర్వసాధారణంగా జాతీయ పతాకం హైకోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, కమీషనర్‌ ‌భవనాలు, కార్యాలయాలు, జైళ్లు, జిల్లా పరిషత్‌ ‌కార్యాలయాలు మున్సిపల్‌ ‌కార్పోరేషన్‌ ‌కార్యాలయాలు, వంటి పబ్లిక్‌ ‌ప్రధాన కార్యాలయాల భవనాలపై ఆవిష్కరింపబడి ఉండాలి.ఇవే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై ఆవిష్కరింపబడి ఉండాలి.మరియు రాష్ట్ర సరిహద్దులలో, చెక్‌ ‌పోస్టులు, తనిఖీ కార్యాలయాలు,లైసెన్స్ ‌కార్యాలయాలు,ట్రాన్స్ ‌పొర్ట్ ‌కార్యాలయాలు, శిస్తు చెల్లింపు కార్యాలయాల వంటి ప్రభుత్వ నిర్వహణాధికారుల కార్యాలయాల పై కూడ జాతీయ పతాకం దర్శనమిస్తుంది. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్‌ ‌గవర్నర్లు నివసించే భవనాలపై భారత జాతీయ పతాకం నిత్యం ఎగురుతూ ఉండాలి. అయితే వారు పర్యటనార్థం ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరల తిరిగి వచ్చే వరకు ఆయా భవనాలపై జాతీయ పతాకం దించి ఉంచాలి.ఆ పర్యటనలలో వారికి ఏర్పడిన తాత్కాలిక స్థావరంపై పతాకాన్ని ప్రతిష్టిస్తారు. తిరిగి ఆ స్థావరం నుండి హెడ్‌ ‌క్వార్టర్‌ ‌కు బయలుదేరగానే విడిది చేసిన ప్రదేశంలోని పతాకాన్ని దించివేస్తారు.వారు హెడ్‌ ‌క్వార్టర్‌ ఆవరణలో ప్రవేశించగానే ఆ ప్రధాన భవనంపై జాతీయ పతాకం ఎగురుతుంది.అంటే ఆ ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా  జాతీయ పతాకం వారిని అనుసరిస్తూ ఉంటుంద న్నమాట.ఇది మన జాతీయ సంప్రదాయం.అయితే జాతీయ పతాక నిబంధనావళిలో సూచించబడిన ప్రత్యేక పర్వదినాలలో మాత్రం ఆ ప్రముఖులు వారి భవనంలో ఉన్నా, లేకపోయిన సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు జాతీయ పతాకం విధిగా ప్రదర్శించబడి ఉండాలి.

అంతేకాదు విదేశాలలోని భారత రాయబారి కార్యాలయ నివాస భవనాలపై, కమీషనర్‌ ‌ల కార్యా లయాలపైన, ప్రతినిధి సంఘాధ్యక్షుల నివాస స్థావ రాలపైన, వారి కార్యాలయాలపైన జాతీయ పతాకం రెపరపలాడుతూ ఉంటుంది. ఇతర దేశాల ప్రతినిధులు మన దేశాన్ని సందర్శించినపుడు ఆయా స్థలాలలో వారికి ఆతిథ్యం ఇస్తున్న భవనాలపై విదేశి పతాకాలతో పాటు మన జాతీయ పతాకాన్ని కూడ ప్రదర్శించడం ఆనవాయితీ.దేశంలో ప్రముఖ వ్యక్తులు మరణించినపుడు పతాక నిబంధనావళి ప్రకారం వారి పట్ల శోక సూచకంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయడం అంటే సగం వరకు దించడం ఆనవాయితీ.అంత్యక్రియల అనంతరం యధావిధిగా కార్యక్రమాలు కొన సాగుతాయి.ఇది మన జాతి గౌరవానికి సంబంధించిన విషయం. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నందున స్వాతంత్య్ర స్ఫూర్తిని మేల్కొలిపేలా,ప్రతి గుండేలో భారతీయత నింపేలా  కుల, మత, రాజకీ యాలకతీతంగా ‘‘హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా’’ నినాదంతో దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని భారత ప్రభుత్వం పిలుపునిచ్చినందున జాతీయ పతాక నిబంధనావళిని అనుసరిస్తూ ప్రతి ఒక్కరు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి      మన భరతజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటుదాం..
ఎంతో ప్రాముఖ్యత కలిగిన మన త్రివర్ణ పతాకాన్ని ఇంటి పై  ఎగురవేసిన మనం ఫ్లాగ్‌ ‌కోడ్‌ ‌నియమావళి ప్రకారం సూర్యస్తమయ సమయానికి కిందికి దించి తగిన స్థానంలో భద్రపరుచుకుందాం..
‘‘జైహింద్‌’’

image.png
‌నరేందర్‌ ‌రాచమల్ల
99892 67462

Leave a Reply