Take a fresh look at your lifestyle.

జాతీయ పానీయం టీ (చాయ్‌) ..

‘‘‌వేడి వేడి టీ తాగుతూ ఉంటే అదొక అనుభూతి. కొంత మంది బెడ్‌ ‌టీ తాగితే,మరి కొంత మంది ముఖం కడగ గానే ఫస్ట్ ‌టీ తాగిన తరువాత నే మిగతా పనులు చేస్తూ ఉంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం టీ ఉత్పత్తి ద్వార జరుగుతూ వుందని సర్వేలు చెబుతున్నాయి. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరు తాగేది టీ మాత్రమే.’’

‌నేడు ఆంతర్జాతీయ టీ దినోత్సవం

యేచాయ్‌ ‌చటుక్కున తాగరాబాయి.అంటూ  పాటల రచయిత చంద్రబోస్‌ ఒక సినిమాలో టీ  ప్రాముఖ్యత ని వర్ణించడం జరిగింది.నలుగురు మిత్రులు స్వేచ్చగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది టీ కొట్టు దగ్గరే.మన ఇంటికి స్నేహితులు, బంధువులు వచ్చినా వారికి  అందిచే పానీయం చాయ్‌ ‌మాత్రమే.వేడి వేడి టీ తాగుతూ ఉంటే అదొక అనుభూతి. కొంత మంది బెడ్‌ ‌టీ తాగితే,మరి కొంత మంది ముఖం కడగ గానే ఫస్ట్ ‌టీ తాగిన తరువాత నే మిగతా పనులు చేస్తూ ఉంటారు.ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం టీ ఉత్పత్తి ద్వార జరుగుతూ వుందని సర్వేలు చెబుతున్నాయి. పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరు తాగేది టీ మాత్రమే.  నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో చాయ్‌ (‌టీ) పాత్ర ఎనలేనిది.అలసటగా ఉన్నా, సోమరితనం, తల నొప్పితో వున్నా ఓ సింగిల్‌ ‌టీ కొడితే అన్ని మటు మాయం.నేడు దేశ ప్రధాని గా వున్న మోదీ  ఒకప్పుడు చాయ్‌ ‌వాలానే.

టీ ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారింది.సగటు భారతీయుల్లో సగానికి పైగా టీ తాగుతూ వున్నారు.మూడు దశాబ్దాల క్రితం ఎక్కవగా కాఫీ తాగే అలవాటు మాత్రమే వుండేది.ఫిల్టర్‌ ‌కాఫీ బాగ వాడుకలో వున్న రోజుల్లో యిన్‌ ‌స్టంటు కాఫీలు రావడం ,వాటితో పాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌ ‌లోకి రావడం ,జన సామాన్యం లో టీ కి అధిక ప్రాధాన్యత ఏర్పడటం,ప్రతి ఒక్కరికి టీ ధర అందుబాటు లోకి రావడం  వల్ల టీ కి తగిన గుర్తింపు వచ్చింది.నేడు ప్రపంచ వ్యాప్తంగా టీ తాగని ఇల్లు లేదు.ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 15 ‌న అంతర్జాతీయ టీ దినోత్సవం ని నిర్వహిస్తూ ఉంటారు.పశ్చిమ బెంగాల్‌ ‌లోని డార్జిలింగ్‌ ‌ప్రాంతంటీ కి అనువయిన ప్రదేశం గా భావిస్తారు. ఈ ప్రదేశం శీతలముగా వుండి ,మంచు చేత కప్పబడడం వల్ల ఇక్కడ ఉత్పత్తి అయ్యే టీ కి ప్రత్యేక రుచి, వాసన ఉంటుంది.

టీ తోటలలో లక్ష లాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తూ వున్నాయి.అనేక మంది మహిళలు ఉపాధి పొందుతూ వున్నారు.కత్తిరించిన టీ ఆకులను ప్రాసెస్స్ ‌చేయడం జరుగుతుంది.తర్వాత టీ పౌడర్‌ ‌గా మరుస్థారు.నాలుగవ  శతాబ్దం లో ఒక చైనా వైధ్యుడు తేయాకు ఆకులను తుంచి ,ఎండ బెట్టి ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతలో వేడి చేసి నాన బెట్ట గా వచ్చిన చేదు ద్రావకంని సేవించిండు..ఈ టీ డికాశన్‌ ‌తాగడము వలన ఉత్తేజం పొంధినారని ,టీ తాగడము వల్ల మొదటి సారిగా ఆనందం,అనుభూతి పొంధినారని తెలిసింది.15 వ శతాబ్దంలో టీ తాగడం ప్రారంభ మయింది.17 వ శతాబ్దంలో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ వినిమయ పధ్ధతి లో బట్టలు,వెండికి  అనధికారముగ నల్ల మందుకు బదులు టీని చైనా నుండి దిగుమతి చేసుకోవడం జరిగేది.చాల కాలం తర్వాత 1823 లో బ్రిటన్‌ ‌కి చెందిన బ్రూస్‌ ‌సోదరులు అస్సాం లో దేశీయంగ టీని క నిపెట్టినపుడు మన దేశం లో టీ  ఉత్పాదన ప్రారంభం  అయినది.1793 లో చైనా నుండి బ్లాక్‌,‌గ్రీన్‌ ‌రకాల విత్తనములను తెప్పించి కలకత్తా బొటానికల్‌ ‌గార్డెన్‌ ‌లో లార్డ్ అనే వ్యక్తి నాటించాడు.ఇవి బెంగాల్‌ ‌లోని నీలగిరి,కాచార్‌ ‌ప్రదేశాలలో  నాటినారు.నేడు మన దేశం లోని సగానికి పైగా టీ మొక్కలు ఇక్కడివే.1860 తర్వాత అనతి కాలంలోనే చైనా టీ మన వాతావరణ పరిస్థితులకు అనుగుణం గా వృద్ది చెందింది..నేడు అస్సాం,కేరళ,తమిళ నాడు,వెస్ట్ ‌బెంగాల్‌ అధికంగా  టీని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు గా గుర్తింపు పొందినాయి.ఈ రాష్ట్రాలు  సుమారు 98 శాతం టీ ని ఉత్పత్తి చేస్తూ వున్నాయి. కర్నాటక, త్రిపుర, మణిపూర్‌, ‌సిక్కిం రాష్ట్రాల్లో  తక్కువ గా టీ ని ఉత్పత్తి చేస్తున్నారు. సతత హరిత  అయిన టీ కి వర్షపాతం అధికంగా వుండాలి.అప్పుడే మొక్క యేపుగా పెరుగుతూ వుంటుంది .దిగుబడి అధికంగా ఉంటుంది.సముద్ర మట్టంకి  ఎత్తుగా ఉండే ప్రదేశాలలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి.
‘‘ఒక్కో దేశం లో ఒక్కో తీరు’’
అమెరికా, రష్య, జపాన్‌, ‌చైనా దేశాల్లో టీ డికాక్షన్‌ ‌ని కాచి పంచదార, పాలు కలపకుండా తాగుతారు. ఒక్కోసారి నిమ్మరసం,పంచదార కలిపి తాగుతారు. అమెరికా  లో టీ లో ఐస్‌ ‌వేసి తాగుతారు. టిబెటియన్లు గ్రీన్‌ ‌టీ ని ఉప్పు, వెన్నతో కలిపి కొయ్య కప్పుల్లో తాగుతారు. ఆఫ్రికా లో డికాక్షన్‌ ‌ని చిలికి నురగగా తయారు చేసి తాగుతారు.  మన దేశం లో గుజరాతీలు మసాల టీ తాగుతారు. బ్లాక్‌ ‌లేదా గ్రీన్‌ ‌టీని యాలకులు,కొట్టిన బాదం పప్పు ను కలిపి కహ్వ పేరుతో కాశ్మీరీలు తాగుతారు. తెలుగు రాష్ట్రాలలో    అల్లం టీ ప్రసిద్ధమైనది.ప్రస్తుతం టీ ధర పది నుండి పదిహేను రూపాయలు వుంది. టీ కి గిరాకీ పెరిగింది. పుదీనా  టీ,గ్రీన్‌ ‌టీ,అల్లం చాయ్‌ ‌వాడకం తెలంగాణ రాష్ట్రం  లో పెరిగింది.లక్షలాది మందికి టీ అమ్మకం ద్వారా జీవనోపాధి కలుగుతుంది.

  ‘‘జాతీయ పానీయం గా గుర్తింపు’’  
మన దేశం లో రోజు  రోజు కి టీ వినియోగం పెరుగు తుంది.ప్రతి మనిషి రోజుకు 100 మిల్లి లీటర్ల టీ తాగుతున్నాడు.అంటే  దేశ వ్యాప్తంగా  పన్నెండున్నర  కోట్ల లీటర్ల టీ  సేవిస్తువున్నారు. ఒక్క టీ తయారీకి రెండు  గ్రాముల టీ పౌడర్‌ అవసరం  పడుతుంది. భారత ప్రభుత్వం టీ ని జాతీయ పానీయం గా గుర్తించింది . అనేక పరిశొధనల ఫలితంగా టీ తాగడం శరీరానికి మంచిదే అని శాస్త్రవేత్తలు, వైధ్యులు వెల్లడించారు.టీ తాగడం  వల్ల బరువు తగ్గడం జరుగుతుందని తెలుస్తుంది.గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది .పేగుల్లోని క్రిముల ను సంహరిస్తుంది .చురుకుదనం ని పెంచుతుంది.  అధికంగా  కూడా టీ ని తాగితే ఆకలి మందగించడం, జీర్ణ కోశ వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.కావున టీ తాగుదాం.ఉల్లాసం గా ఉందాం.

image.png
కామిడి సతీష్‌ ‌రెడ్డి,
తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు.
జడలపేట,జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా,9848445134.

 

Leave a Reply