Take a fresh look at your lifestyle.

రాజ్యాంగ నౌక

దేశం ఒక భౌతిక రూపం
దేశం పోకడలే రాజ్యాంగం
రాజ్యాంగ బ్రహ్మలు
లౌకిక ప్రజాస్వామ్యం సర్వసత్తాక
గణతంత్రానికి ఊపిరు లూదిరి
విశ్వవిఖ్యాత విరాట్‌ ‌రాజ్యాంగం
జనరంజక పాలనకు దిక్సూచి
దేశ దేహాత్మకు ప్రాణాత్మకం!
అవతారిక ఆశయాలకు అద్దం పట్టు
అది దేశానికి విజ్ఞాన గరిమ!
ఆత్మ మాట వింటే ఆరోగ్యం
అప్పుడప్పుడు అనారోగ్యం
సమాలోచనల సంక్షేమ చికిత్స !
రాజ్యాంగం
రాజ్యపాలనా నౌకకు చుక్కాని!
కానీ,
ప్రభుత్వం అనే చట్టాలు
రాజ్యాంగం అనే నౌకలో
సప్తఖండ సమస్యల సాగరంలో
రాజ్యాంగ నిర్మాతల
ఆకాంక్షలు మునగకుండా
ప్రజలను సుఖ జీవన తీరాలు చేర్చాలి!

– పి.బక్కారెడ్డి
 9705315250
నవంబర్‌26, ‌రాజ్యాంగ దినోత్సవం

Leave a Reply