Take a fresh look at your lifestyle.

14 ఏళ్ల హేమేశ్‌ ‌చదలవాడకు రాష్ట్రీయ బాలల పురస్కారం

భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రూపొందిస్తా: హేమేశ్‌
‌ఈ ఏడాది ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి హిమేశ్‌ ‌చదలవాడ ఎంపికయ్యారు. కళలు, సామాజిక బాధ్యత, సంస్కృతి రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన వారికి ప్రతీ ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేస్తారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలోని 32 జిల్లాలకు చెందిన చిన్నారులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో కళలు, సాంస్కృతిక విభాగంలో ఏడుగురు బాలలకు, ఆవిష్కరణల విభాగంలో తొమ్మిది మందికి, క్రీడల విభాగంలో ఏడుగురు, ధైర్యసాహసాల విభాగంలో ముగ్గురు, సామాజిక సేవలో కృషి చేసిన ఒకరికి ఈ అవార్డులు లభించాయి. కాగా, తెలంగాణ రాష్ట్రం నుంచి హిహేశ్‌ ‌చదలవాడ ఇన్నోవేషన్‌ ‌విభాగంలో రాష్ట్రీయ బాలల పురస్కారానికి ఎంపిక కావడం విశేషం.

హైదరాబాద్‌ ‌కూకట్‌పల్లికి చెందిన 14 ఏళ్ల హేమేశ్‌ ‌చిన్న వయసులోనే పోగ్రామ్‌ ‌డెవలపర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పలు ఎంటర్‌‌ప్రెన్యూర్‌ ‌పోటీలలో పాల్గొని ప్రతిభను కనబరిచాడు. తనకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారం లభించిన సందర్భంగా సోమవారం హేమేశ్‌ ‌చదలవాడ ’ప్రజాతంత్ర ప్రతినిధి’తో మాట్లాడుతూ ప్రధాన మంత్రి బాలల పురస్కారానికి ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది తాను భవిష్యత్తులో రూపొందించబోయే ప్రాజెక్టులకు మరింతగా దోహదం చేస్తుందనన్నారు.

ఇదే ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు రూపొందిస్తానని చెప్పారు. తాను వృద్ధులు, డిసేబుల్డ్ ‌వారికి ఎక్కువగా ఉండే మతిమరుపు వ్యాధి కారణంగా ఎదుర్కునే ఇబ్బందులకు పరిష్కారంగా ఒక ప్రాజెక్టును రూపొందించాననీ, దీని వల్ల వారందరికీ శాశ్వతంగా చికిత్స లభిస్తుందన్నారు. దీనికి సంబంధించి ఒక మొబైల్‌ ‌యాప్‌ను సైతం రూపొందిస్తున్నాననీ, దీని ద్వారా తమకు ఉన్న సమస్యలను వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లి చికిత్స పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.

Leave a Reply