Take a fresh look at your lifestyle.

నరుల ‘నరక’ పోకడలు

మానవీయతకే చెరగని మరకలు
షరతుల చట్రంలో సంబంధాలు
ఆస్తులకే కుటుంబ విచ్ఛిన్నాలు !

హత్యలే జీవనోపాధులు
శ్వేత వస్త్ర ముసుగులో అక్రమాలు
పట్టపగలే దొంగల స్వైరవిహారాలు !

విషాన్ని కక్కుతున్న మతాలు
కొట్లాటలకేనా కులమతాలు
నేరాలేగా రాజకీయ అర్హతలు !

నాయకుల శుష్క వాగ్దానాలు
ఓటర్లకు ఓట్లే ఆదాయాలు
విమర్శల వర్షాలకే ప్రతిపక్షాలు !

ఉద్యోగుల మురికి చేతులు
రాత్రుల్లో చీకటి ఒప్పందాలు
పసలేని ప్రభుత్వ పథకాలు !

వ్యాపారుల కల్తీల లీలలు
పారిశ్రామిక విష కాలుష్యాలు
వ్యాపార ధోరిణిలో మాటలు !

అంగట్లో సరుకులైన అతివలు
సరోగసీ అద్దె అమ్మ గర్భాలు
అమ్మకానికే అమ్మతనాలు !

మానవత్వానికి పట్టాభిషేకాలు
సమాజహిత మేధో మథనాలు
కావాలి రేపటి తరం పునాదులు !
– మధుపాళీ
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply