Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలులో నర్సంపేటదే అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గం నుండి అత్యధికంగా ధాన్యాన్ని మద్దతు ధరకు కొను గోలు చేసినట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శ న్‌రెడ్డి తెలిపారు. ఈ సంధర్బంగా సోమవారం నర్సంపేట ఆరండ్బీ గెస్ట్ ‌హౌస్‌ ‌మందు ముఖ్యమం త్రి కేసీఆర్‌ ‌చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి ప్రోత్సాహంకంతో వచ్చిన సంక్షేమ పథకా లను సద్వినియోగ పర్చుకొని, ప్రభుత్వ సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని, అనేక ప్రాజెక్టులు ద్వారా వచ్చిన గోదావరి నది జలాల ద్వారా పం టలు బాగా పండించి, మంచి దిగుబడి సాధించి, రాష్ట్రంలోనే అన్ని పంటలలో అత్యధిక దిగుబడి సాధించిన నర్సంపేట రైతులు పండుగ జరుపుకుం టున్నారు. నర్సంపేట రైతుల చైతన్యానికి అభినం దనలు తెలిపారు. ఆ చైతన్యంతోనే నర్సంపేట నియోజకవర్గంలోనే ఒక్క యాసంగి పంటకి లక్ష 50 వేల మెట్రిక్‌ ‌టన్నుల మక్కలు, లక్ష మెట్రిక్‌ ‌టన్నుల పైచిలుకు వరి ధాన్యం దిగుబడి తీసుకొచ్చా రన్నారు. అదేవిధంగా నాణ్యమైన మిర్చిని పండించే ప్రధాన కేంద్రమైన నర్సంపేటలోని రైతులు దాదాపుగా 35 వేల మెట్రిక్‌ ‌టన్నుల ఉత్పత్తిని సాధించారని ఆయన తెలిపారు. 25 వేల మెట్రిక్‌ ‌టన్నుల నాణ్యమైన పసుపును కూడా నర్సంపేట రైతులు ఉత్పత్తి చేశారన్నారు. ఇచ్చిన మాటమేరకు ప్రతి చివరి రైతు  యొక్క దాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను విజయవంతం చేసామని చెప్పారు.

కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సమస్యలను అధికమించామన్నారు. నూతన వ్యవసాయ విధానం పాటించే దిశగా నియోజక వర్గ రైతాంగం మొగ్గు చూపుతోందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల ద్వారా లాభదాయకమైన, మంచి డిమాండ్‌ ఉన్న పంటలు పండించే విధంగా రైతులను చైతన్య పరిచామని చెప్పారు. రైతు సంఘాల భలోపేతం ద్వారా ఫుడ్‌ ‌ప్రాసెస్సింగ్‌ ‌యూనిట్లు నెలకొల్పి, రైతులు పండించే ఆహార పంటలకు స్థానికంగా లబ్ది చేకూర్చుతామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతనంగా గోదాము ల నిర్మాణం కొరకు ఇప్పటికే స్థల సేకరణ చేసామని చెప్పారు. పాకాల రంగాయ చెరువు, ఎస్సారెస్పీల ద్వారా సంవృద్దిగా రెండు పంటలు పండించి రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించి ముందుకు పోతున్నామని తెలిపారు. రుణాలు అందజేత, సబ్సిడీలపై కరెంట్‌ ‌మోటార్ల పంపిణీ, పాడి గేదెల పంపిణీ, వ్యవసాయ పనిముట్లు మరియు ట్రాక్టర్ల పంపిణీ మొదలగు పధకాల ద్వారా ఎంతో మంది రైతులకు లబ్ది చేకూర్చామని వచ్చే విడతలో మిగిలిన రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటికే పెట్టుబడి రూపంలో రైతుకు సాయం రైతు బంధు, రైతు భీమా లాంటి అద్భుత పధకాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధం గా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభు త్వం కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి మరిన్ని అద్భుత పథకాలు రూపకల్పన చేస్తున్నారని,  త్వరలో రైతులకు తీపి కబురు అందించనున్నారని ఈ సందర్భంగా ఎమెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట రూరల్‌ ‌మండల, పట్టణ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply