Take a fresh look at your lifestyle.

కాలిపోయే మోటార్లు…బాయికాడ మీటర్లు…ఉచిత కరెంట్‌ ‌మధ్యే పోటీ

దుబ్బాక ప్రజలు ఎటో ఆలోచించుకోవాలి
పోసాన్‌పల్లి ఎన్నికల సభలో మంత్రి హరీష్‌రావు

దుబ్బాకకు జరుగుతున్న ఉప ఎన్నిక కాలిపోయిన మోటార్లు, బాయిలకాడ కాడా కరెంటు మీటర్లకు ఉచిత కరెంటుకు మధ్య పోటీ అని ఈ పోటీలో వోటర్లుగా మీరు ఏ వైపు ఉంటారనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పోసాన్‌పల్లి వోటర్లనుద్దేశించి అన్నారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత-రామలింగారెడ్డికి మద్ధతుగా శనివారం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్‌ ‌మండలంలోని పోసాన్‌పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు పాల్గొని మాట్లాడుతూ..దుబ్బాక ఉప ఎన్నికల్లో ..కాలి పోయే మోటార్లు…. బాయి కాడా మీటర్లు… ఉచిత కరెంటు మధ్య పోటీ అన్నారు. కాలి పోయే మోటార్లు అంటే కాంగ్రెస్‌.. ‌బాయికాడ మీటర్లు అంటే బిజెపి… ఉచిత కరెంట్‌ ..‌కడుపు నిండా సంక్షేమం అంటే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో వోటర్లు చాలా ఆచితూచి వోటెయ్యాలన్నారు.

70 ఏళ్ల కాంగ్రెస్‌, ‌బిజెపి పరిపాలనలో లేని అభివృద్ధి  గడిచిన  6ఏళ్ల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.  గతంలో మంచి నీరు కోసం ట్యాంకర్ల వెనకాల బిందెలతో మహిళల కోట్లాట ఉండేదనీ,  అప్పుడు ఎండాకాలం బోర్లు వేస్తే దుబ్బాకలో సుక్క నీరు కూడా రాకపోయేదన్నారు. కానీ, తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక ఇంటింటికి  నల్లా ద్వారా స్వచ్ఛమైన  త్రాగు నీరు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు కేసీఆర్‌  ‌నాయకత్వంలో మంచి నీరు బాధలేదన్నారు. అలాగే, వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరంటును కూడా ఇస్తున్నామన్నారు. గతంలో దుబ్బాకలో కాలిపోయిన మోటార్లు ,పేలిపోయిన విద్యుత్‌ ‌ట్రాన్స్‌ఫార్మార్లు, బాయిలకాడ మీటర్లు ఉండేవన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయంలో కరెంటు  ఉండేదా? దొంగ రాత్రి కరెంటు రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారనీ అన్నారు. కాంగ్రెస్‌ ‌హయంలో మోటార్‌ ‌కాలిపోతే 10వేల రూపాయలు, ట్రాన్స్‌ఫార్మర్‌ ‌కాలిపోతే 30వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి అని, ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వ పాలనలో కరెంటు కష్టాలేమీ లేవన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply