Take a fresh look at your lifestyle.

రెండో విడతలో నరేంద్ర మోదీ రెండేళ్ళ పాలన సవాళ్ళు – సాఫల్యతలు..!

“2014‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో, కేంద్రంలో యూపిఏ ప్రభుత్వాన్ని ఓడించి, మొదటి సారి నరేంద్ర మోదీ నాయకత్వాన బిజెపి కొలువు తీరింది. ఐదేండ్ల పాలన తరువాత మరోసారి 2019 ఎన్నికల్లో ప్రజామోదంతో మోదీ రెండోసారి అధికారం లోకి వచ్చింది. మోదీ ప్రజాకర్షణ, అమిత్‌ ‌షా పార్టీ అధ్యక్షత పార్టీని ఉత్తేజపరచి కొలువు తీరిందనడృలో సందేహంలేదు. మోది మాటలను ప్రజలు వేదంలా భావించి స్పందించారు. ప్రజల హృదయాలలో స్థిరంగా స్థానం సంపాదించగలిగారు. మోదీ మాట, ప్రవర్తన ఆహార్యం ప్రజల్లో ఓ రకమైన భారతీయతను చూపిందనడంలో సందేహంలేదు. మోదీ కూడా మనవంటి సాధారణ మానవుడే. ఆయన వద్ద మంత్రదండం లేదు.”

2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో, కేంద్రంలో యూపిఏ ప్రభుత్వాన్ని ఓడించి, మొదటి సారి నరేంద్ర మోదీ నాయకత్వాన బిజెపి  కొలువు తీరింది. ఐదేండ్ల పాలన తరువాత మరోసారి 2019 ఎన్నికల్లో ప్రజామోదంతో మోదీ  రెండోసారి అధికారం లోకి వచ్చింది. మోదీ ప్రజాకర్షణ,  అమిత్‌ ‌షా పార్టీ అధ్యక్షత పార్టీని ఉత్తేజపరచి కొలువు తీరిందనడృలో సందేహంలేదు. మోది  మాటలను ప్రజలు వేదంలా భావించి స్పందించారు.  ప్రజల హృదయాలలో స్థిరంగా స్థానం సంపాదించగలిగారు. మోదీ మాట, ప్రవర్తన ఆహార్యం ప్రజల్లో ఓ రకమైన భారతీయతను చూపిందనడంలో సందేహంలేదు.  మోదీ కూడా మనవంటి సాధారణ మానవుడే. ఆయన వద్ద  మంత్రదండం లేదు.

2019 ఎన్నికల విజయంతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోదీ రెండు సంవత్సరాల్లో  విప్లవాత్మక నిర్ణయాలను తీసుకొని ప్రజల దృష్టి ఆకర్షించింది. . ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌బిల్లు, రాజ్యాంగంలోని ఆర్టికిల్‌ 370,  35 ఏ ‌రద్దు, పౌరసత్వ సవరణ చట్టం…. ఒకదాని వెంట మరొకటి సులభంగా జరిగి పోయాయి. అనాదిగా రగులుతున్న రామ జన్మభూమి వివాదం సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు పరిష్కారం  ప్రజల మన్ననలు పొందింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణ బాధ్యతలు చేపట్టడానికి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ప్రజల వద్ద 5,457 కోట్లకు పైగా విరాళాలు సేకరించగలిగారు. ప్రజాస్వామ్య యుతంగా చక్కటి పరిష్కారాలు చూపగలిగిన మోదీ రెండవ విడత ప్రభుత్వం ప్రజల వద్ద మంచి మార్కులు సంపాదించింది.

రెండో విడత  రెండేళ్ళు పూర్తి చేసుకుంటున్న మోదీ  ప్రభుత్వం ఎదుట అనేక సంక్షోభాలు ఊపిరాడనంతగా ఎదుర్కొంటునినది.  మార్చి 2020లో కరోనా  మానవాళిని  కంటి మీద కునుకు లేకుండా చేసింది. నాటి నుంచి నేటి వరకు కరోనా తొలి అల తరువాత మరో అల కమ్ముతూ ప్రజలను భయబ్రాంతులను చేస్తున్నది. మొదటి దఫా కరోనా  కట్టడికి కేంద్ర ప్రభుత్వం సమయానుసారం పరిస్థితులను బేరీజు వేసుకుంటూ లాక్‌డౌన్లు, జనతా కర్ఫ్యూలు, దీపాలు వెలిగించడం, కరోనా పారద్రోల మంటూ నినాదాలు ఇవ్వడం లాంటి ప్రజా చైతన్య కార్యక్రమాలతో  సమర్థవంతంగా నియంత్రించటంలో సఫలీకృతం అయి,  అనేక దేశాల  ప్రశంస లందుకుంది.  ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ఇనుమడింపజేయడంలో మోదీ ప్రభుత్వం చేసిన కృషి అసాధారణమే. కరోనా  కట్టడికి 90కి పైగా దేశాలకు 6.5 కోట్ల టీకా డోసులను అందించి వసుధైక కుటుంబ భావనను ప్రపంచ దేశాలకు ఇవ్వగలిగారు.

అదే సమయంలో రెండవ విపత్తు  సునామీలా వస్తుందనే నిపుణుల చేసిన హెచ్చరికలకు తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవడం లో మోదీ విఫలమైయ్యారని కొందరు విమర్శిస్తునినారు. అది సంహేతుకం కాదని కొందరి భావన. 70 ఏళ్ళుగా చేయలేని పని మోదీ తక్షణమే చేయలేకపోయిందని అనడం అవగాహనా రాహిత్యమని కొందరి వాదన.. స్వదేశీ టీకా తయారీలో మోదీ చొరవ ప్రదర్శించడం ప్రసంశనీయం. జాతిని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలను అధిగమించిన తీరును ప్రజలు మరువకూడదు. లాక్‌డౌన్‌ల వంటి కరోనా కట్టడి చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు  మోదీ  స్వేచ్ఛనిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

అనేక జాతిహిత సంస్కరణలతో పాటు, వ్యవసాయ, పారిశ్రామిక, బ్యాంకింగ్‌ ‌రంగాలకు ఊతం ఇస్తూ దేశ ఆర్థిక ప్రగతిని పరుగులెత్తించడానికి చేసిన ప్రయత్నాలు కొరోనా కల్లోలంతో మంద గించాయి. దేశ ఆర్థిక సంపద 5 ట్రిలియన్‌ ‌డాలర్లకు చేర్చాలనే లక్ష్యాలకు కోవిడ్‌-19 ‌గండికొట్టింది వాస్తవం. దేశం రక్షణ, విదేశీ విధానాల్లో మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం  రెండు సార్లూ అభివృద్ధి సాధించడం అందరికీ తెలిసిందే, . రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సైన్యంలో నూతనోత్తేజం నింపడానికి జె అండ్‌ ‌కె సరిహద్దు జవాన్లతో పర్వదినాలు గడపిన ప్రధాని మోది ఒక్కరే.  చైనా, పాకిస్థాన్‌ ‌లాంటి పొరుగు శత్రుదేశాలు ఇవాళ ఇండియా వైపు చూడడానికి భయపడు తున్నాయని గర్వంగా చెప్పవచ్చు.. దేశానికి సమర్ధుడైన ప్రధాని దొరికాడని నమ్ముతున్నారు.

మోదీకి ప్రత్యామ్నాయం కనిపించడం లేదని పలువురి అభిప్రాయం..  ఐరాసను ఒప్పించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు పాటించేలా చేయగలిగారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పక్షాలకు విలువ ఉంటుంది. నేడు ప్రతిపక్షాలు ప్రభుత్వ  పాలసీల మీద కాకుండా వ్యక్తుల పై విమర్శలకు దిగుతున్నాయన్న విమర్శలు ఎదురికొంటున్నాయి.  ప్రధాని  భారతదేశానికి గుండెకాయ లాంటి వాడు. ఆయనపై  ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని మాట కాదనలేరు. మరో ప్రజాకర్షణ కలిగిన ప్రత్యామ్నాయ నాయకుడెవరని ప్రశ్నిస్తే జవాబు లేదు. అందరి అంచనాలు 2024 ఎన్నికల్లో మరోసారి బయట పడతాయి. దేశ రాజకీయాల్లో మోదీ మానియా ముందు ఎవరూ నిలబడలేక పోతున్నారు. 2024లో మోదీ మూడో సారి  కొలువు తీరటం తథ్యం అనుకుని ఆశ పడేవారూ ఉన్నారు. కాదనలేం. భరత మాత  ముద్దు బిడ్డ నరేంద్రనాథ్‌ (‌వివేకానందుడు) భారతీయ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసినట్లు,  ఏడేండ్ల పాలనలో భారతీయతా పతాకాన్ని వినువీధుల్లో ఎగురవేసిన ఘనత   నరేంద్ర మోదీ కే దక్కుతుందనడంలో  సందేహం లేదు.

డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply