వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు,ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన మేరకు గురువారం హన్మకొండలోని నారాయణ పాఠశాలను సీజ్ చేశారు. ఏలాంటి అనుమతులు లేకుండా నగరంలో విచ్చలవిడిగా అడ్మిషన్స్, గ్లోబల్ ప్రచారాన్ని ఆ విద్యా సంస్థ చేస్తుందని విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆర్జెడి స్పందించి ఆ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని డిఈఓకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాలను విద్యార్థి సంఘాల సమక్షంలో ఎంఈఓ వీరభద్రం సీజ్ చేశారు.