కోపపుతెరలు కప్పుకున్న మార్థవ మనస్కుడు…!
చెక్కుచెదరని ధైర్యంతో
కుటుంబపు మేరుపర్వతాన్ని మోస్తున్న గోవిందుడు..!!
వేలుపట్టి నడిపించే గురుసమానుడు.!
తప్పుచేస్తే దండించే
శ్రేయోభిలాషకుడు.!
అహర్నిశలు వారసుల క్షేమానికై
ఆలోచించించే నిరంతరశ్రామికుడు..!
తనవారి ఆనందమే తృప్తిగా
జీవించే నిస్వార్థపరుడు..!!
మదిలోని మమతలను మాటల్లో చెప్పలేక
గుండెలోని వేదనను గుట్టివిప్పి నివేదించలేక
కళ్లలోని కన్నీళ్లను చెలియకట్టదాటనీయక
చిరునవ్వుల వాకిళ్లలో
గంభీరత రంగవల్లులను పరుచుకున్న మార్గదర్శకుడు..!
బిడ్డల భవితకై
అలుపెరుగక కష్టించే కర్షకుడు..!
భావి జీవనక్షేత్రంలో
ఆనంద విత్తులను నాటాలనుకునే నమ్మకపు కృశీవలుడు..!!
సంకల్పసిద్ది ధారకుడై
సంతోషసౌధానికి పునాదిరాయియై
ప్రగతి రధచక్రాలకు సారధియై
అనుబంధ బృందావన వనమాలియై
రక్షించే రక్షకుడు..!
అయిత అనిత, 8985348424