Take a fresh look at your lifestyle.

‌ప్రధాన వీధులకు, మార్గాలకు అమర పోలీసుల పేర్లు..

21 వతేదీ నుండి 31 వరకు పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవాలు  : డీజీపీ ఎం. మహేందర్‌ ‌రెడ్డి

పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ర్యాంకుల పోలీస్‌ అధికారులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడంతో పాటు తెలంగాణాలో పోలీస్‌ ‌సేవలకు సంబంధించిన అంశాలపై ఫోటో కాంపిటీషన్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర డీజీపీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 21 ‌వతేదీ నుండి 31 వరకు పోలీస్‌ అమర వీరుల సంస్మరణతో పాటు పోలీస్‌ ‌ఫ్లాగ్‌ ‌డే పేరుతొ పది రోజులపాటు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీ.జీ.పీ ఎం మహేందర్‌ ‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

ప్రధాన వీధులకు, మార్గాలకు అమర పోలీసుల పేర్లు
తీవ్రవాద చర్యల్లో మరణించిన పోలీసు అమరుల పేర్లను వారి స్వస్థలంలో ఏదైనా ఒక వీధికి గానీ, రహదారికి గాని పెట్టేందుకు లోకల్‌ ‌స్థానిక గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీల నుండి తీర్మానం చేయించి వారి పేరు పెట్టాలని మహేందర్‌ ‌రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా పోలీస్‌ అమరుల కుటుంబసభ్యులను కలసి వారి యోగ క్షేమాలు తెలుసుకొని అవసరమైతే తక్షణ సహాయం అందించాలని స్పష్టం చేశారు. అమర పోలీసుల చిత్ర పటాలను స్థానిక పోలీస్‌ ‌స్టేషన్లల్లో ప్రదర్శించాలని తెలిపారు. పోలీస్‌ ‌ఫ్లాగ్‌ ‌డే ఉత్సవాల్లో భాగంగా ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం ఒక గంట సేపు పోలీస్‌ ‌బ్యాండ్‌ ‌ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అన్ని యూనిట్‌ అధికారులను ఆదేశించారు.

Leave a Reply